Diabetes Home remedies: మీ ఇంటి కిచెన్లోనే డయాబెటిస్‌కు మందు.. ఇలా తీసుకుంటే చక్కెర స్థాయిలు పెరగవు..

Home remedies for Diabetes: డయాబెటిస్ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే మనిషి చనిపోయే వరకు అతన్ని వీడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే, ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం తప్ప దీనికి మనం చేసేదేమి ఉండదు.

1 /5

డయాబెటిస్ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే మనిషి చనిపోయే వరకు అతన్ని వీడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే, ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం తప్ప దీనికి మనం చేసేదేమి ఉండదు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతక సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే.. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. దీనికి మన ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. లైఫ్‌ స్టైల్ మనం చేసుకునే కొన్ని మార్పలతో షుగర్ నియంత్రించవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.

2 /5

బిల్వపత్రం.. బిల్వపత్రం ఆకులు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఇవి శివుడికి ఇష్టమైన పరమపవిత్రమైన ఆకులు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ఇవి సహాయపడతారు. ఈ ఆకులతో కూడా కషాయం మాదిరి తయారు చేసుకుని తాగవచ్చు.

3 /5

మెంతులు.. డయాబెటిస్ తో బాధపడేవారు మెంతులను తమ డైట్లో చేర్చుకోవాలి. రక్తంలో షుగర్ నియంత్రణలో ఉండటానికి ఇవి సహాయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం ఇందులోని హైడ్రాక్సీసోలూసిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటిస్ బాధితులు రాత్రి మెంతులను నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి.

4 /5

దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క కూడా రక్తంలో షుగర్‌ను నియంత్రిస్తుంది. ఇది అందరి ఇళ్లలో కచ్చితంగా ఉండే మసాలా దినుసు. దాల్చిన చెక్కను పొడిచేసి మెంతుల మాదిరి నానబెట్టుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది.

5 /5

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనివారు జింక్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్, గింజలు, తృణధాన్యాలు డైట్లో చేర్చుకోవాలి.  మధుమేహం ఉన్నవారిలో జింక్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు ఈ ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )