Teeth Cavity: వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో తీవ్రమైంది, భరించలేని నొప్పితో కూడుకునేది దంత సమస్య. అయితే దంతాల్లో ఏర్పడే క్రిముల్ని చాలా సులభంగా దూరం చేయవచ్చు. ఆ పద్ధతులేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దంతాల్లో, పళ్లలో ఏర్పడే క్రిములు దంతాల్ని నాశనం చేస్తాయి. భరించలేని నొప్పికి కారణమౌతాయి. కొంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఈ సమస్య నుంచి గట్టెక్కలేరు. అయితే మూడు రకాల పద్ధతుల్ని పాటిస్తే దంత సమస్య నుంచి క్రిముల్నించి ఉపశమనం పొందవచ్చు. దంత సమస్య కారణంగా తినే తిండి రుచి ఉండదు. ఏదీ మనస్ఫూర్తిగా తినలేం. దంతాల్లో రంధ్రాలు ఏర్పడతాయి. సాధారణంగా దంతాల్ని శుభ్రంగా క్లీన్ చేయకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతాయి. ఈ కేవిటీ నుంచి సాధ్యమైనంత త్వరగా విమక్తి పొందకపోతే..నరకం అనుభవించాల్సి వస్తుంది. అదే సమయంలో నెమ్మదిగా ఇతర దంతాలు కూడా పాడైపోతాయి. ఎక్కువగా చాక్లెట్లు, తీపి పదార్ధాలు తినడం వల్ల పండ్లలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫలితంగా టూత్ కేవిటీ ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కే ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం..


లైకో రైస్ పౌడర్


కేవిటీ సమస్య నుంచి గట్టెక్కేందుకు, విముక్తి పొందేందుకు ములేఠీ లేదా లైకోరైస్ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. నేరుగా ములేఠీ పౌడర్ లేదా ములేఠీ లైకోరైస్ వేరు సహాయంంతో పౌడర్ చేసుకోవడం ఏదైనా ఫరవాలేదు. ఆ పౌడర్‌తో బ్రెష్ చేసి..నోరు పుకిలించాలి. ఇలా చేస్తే త్వరగా కేవిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. 


భారతదేశ గ్రామాల్లో అనాదిగా పండ్లను వేప పుల్లతో క్లీన్ చేస్తుంటారు. ఇది సహజంగా గ్రామాల్లో కన్పించే అలవాటు. ఆధునిక జీవనశైలిలో ఇది కాస్త విచిత్రంగా కన్పించినా..అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధానం. వేపపుల్లతో రోజూ పండ్లు శుభ్రం చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.


హెర్బల్ పౌడర్


పండ్ల కోసం ఇంట్లోనే సొంతంగా హెర్బల్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం రెండు స్పూన్స్ ఉసిరి పౌడర్, ఒకస్పూన్ వేప పౌడర్, సగం స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, బేకింగ్ సోడా, సగం స్పూన్ లవంగం పౌడర్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ప్రతిరోజూ ఈ పౌడర్‌తో పండ్లు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే త్వరగానే కేవిటీ సమస్య దూరమౌతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా తగ్గిపోతుంది.


కొబ్బరినూనె


కొబ్బరి నూనె చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. నోటి దుర్గంధాన్ని దూరం చేసేందుకు కొబ్బరి నూనె వాడుతుంటారు. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. కొబ్బరినూనెతో నోరు పుక్కిలిస్తే..ప్లాక్, బ్యాక్టీరియా, వాపు వంటివి దూరమౌతాయి. కేవిటీ సమస్య పోతుంది. 


Also read: High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఇవి తినకండి!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook