Rose Water Health Benifits : రోజ్ వాటర్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు...
Rose Water Benifits for Hair: రోజ్ వాటర్ చర్మం నుంచి విడుదలయ్యే ఆయిల్‌ను నియంత్రించడం ద్వారా చుండ్రుకు చెక్ పెట్టగలదు. రోజ్ వాటర్‌లో ఉండే A, B3, C, E విటమిన్లు ఇన్‌ఫ్లేమేషన్‌ను కూడా నివారిస్తాయి.
Rose Water Benifits for Hair: గులాబీ అనగానే మనసులో లవ్ సింబల్ గుర్తుకొస్తుంది. చాలామంది ప్రేమికులు గులాబీతోనే తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అయితే గులాబీ కేవలం అక్కడికే పరిమితం కాదు. గులాబీలతో తయారుచేసే రోజ్ వాటర్‌ను వంటకాల్లో, సౌందర్య పోషణకు, అరోమా థెరపీకి ఉపయోగిస్తారు.
రోజ్ వాటర్‌ను చాలామంది చర్మ సంరక్షణ కోసమే ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ రోజ్ వాటర్ కేశ సంరక్షణకు కూడా బాగా పనిచేస్తుంది. చుండ్రును నివారించడంలో, చర్మాన్ని పొడిబారకుండా చేయడంలో, తల వెంట్రుకలు రాలిపోకుండా నివారించడంలో రోజ్ వాటర్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. చర్మం నుంచి విడుదలయ్యే ఆయిల్‌ను నియంత్రించడం ద్వారా ఇది చుండ్రుకు చెక్ పెట్టగలదు. రోజ్ వాటర్‌లో ఉండే A, B3, C, E విటమిన్లు ఇన్‌ఫ్లేమేషన్‌ను కూడా నివారిస్తాయి. తద్వారా తల భాగంలో మంట తగ్గి పూర్తి ఉపశమనం కలుగుతుంది.
రోజ్ వాటర్‌ను తల వెంట్రుకలకు ఎలా ఉపయోగించాలి..:
షాంపూ తర్వాత : ముందు షాంపూతో తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత వెంట్రుకలతో పాటు మాడుపై కూడా రోజ్ వాటర్‌ను అప్లై చేయాలి. అలా కొద్దిసేపు ఉంచుకుని ఆ తర్వాత కడిగేయాలి.
షాంపూ లేదా కండిషనర్‌తో కలిపి : కొన్ని షాంపూలు లేదా కండిషనర్లు అందులోనే రోజ్ వాటర్‌ను కలిగి ఉంటాయి. ఒకవేళ మీ వద్ద అలాంటి షాంపూ లేదా కండిషనర్ లేకపోతే చింతించాల్సిన పని లేదు. షాంపూ లేదా కండిషనర్‌కు రోజ్ వాటర్ యాడ్ చేసి... దాన్ని తలకు అప్లై చేసుకోండి.
మాడుపై ఇలా అప్లై చేయండి : చుండ్రు, దురదతో బాధపడేవారు రోజ్ వాటర్‌ను కాటన్ గుడ్డతో మాడుపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. కొద్దిసేపటి తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా చుండ్రుతో పాటు వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది.
Also Read: Village name change: మహా ప్రభో.. మా ఊరి పేరు పరమ బూతు.. పేరు మార్చండి!
Also read: Tonga Island Tsunami: పసిఫిక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం.. టోంగా ద్వీపాన్ని తాకిన సునామి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook