Village name change: ఏ ఊర్లోనైనా సమస్యలు సాధారణం. వాటిని పరిష్కరించుకునేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకోవడం కూడా సాధారణంగా జరిగే ప్రక్రియే. కానీ ఓ ఊరి ప్రజలకు మాత్రం.. తమ ఊరి పేరే పెద్ద సమస్యగా (Village name issue) తయారైంది. అందుకే తమ ఊరికి కొత్త పేరు పెట్టండి మహా ప్రభో అంటూ అధికారులకు కోరుతున్నారు.
ఊరి పేరు.. ప్రజలకు సమస్యగా తయారైందా? అదేమిటని అశ్యర్యపోతున్నారా? మరి ఆ కథేమిటో తెలుసుకుందాం పదండి.
ఊరి పేరుతో ప్రజలకు సమస్య..
స్విడన్‌లో ఓ కుగ్రామం ఉంది. దాని పేరు 'Fucke'. ఇంగ్లీష్‌లో 'Fucke' అనే పదం ఓ బూతు అర్థాన్ని సూచిస్తుంది. ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది ఆ ఊరి ప్రజలకు ఎందుకు పేరు సమస్యగా తయారైందో. ఈ పేరు వల్ల ఆ గ్రామ ప్రజలు అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఫేస్బుక్లో సైతం ఈ ఊరుపేరు రాసేందుకు ప్రయత్నించగా.. సెన్సార్ సమస్యలు ఎదుర్కొన్నామని గ్రామస్థులు పలువురు చెప్పుకొచ్చారు. దీనితో పాటు చాలా చోట్ల తమ ఊరి పేరు చెప్పుకోవడం సమస్యగా తయారైందని వాపోయారు.
అయితే పేరు మాట అటుంచితే.. స్విడన్ హై కోస్ట్‌లోని ఈ గ్రామం చాలా అందంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. స్థానికంగా ప్రవహించే నది (Fucke Lake) ఒడ్డున ఉండటం కారణంగా (Swedish village called 'Fucke').. ఆ ఊరికి ఆ పేరు వచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 1547 సమయంలో ఆ ఊరికి ఈ పేరు పెట్టినట్లు కూడా తెలిసింది.
కొత్త పేరు ఏమిటంటే..
ఇన్నాళ్లు తాము ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశనం పొందేందుకు.. ఊరి పేరు మార్చాలంటూ 'నేషనల్ సర్వే ఆఫ్ స్విడన్'కు గ్రామస్థులు దరఖాస్తు చేసుకున్నారు. 'Fucke' స్థానంలో 'Dalsro' అనే పేరును పెట్టాలని కూడా అందులో పేర్కొన్నారు. Dalsro అంటే ప్రశాంమైన లోయ అని అర్థం. అయితే ఊరి పేరు మార్పు ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది.
Also read: Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం... 26 మంది దుర్మరణం!
Also read: Tonga Island Tsunami: పసిఫిక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం.. టోంగా ద్వీపాన్ని తాకిన సునామి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook