Tonga Island Tsunami: పసిఫిక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం.. టోంగా ద్వీపాన్ని తాకిన సునామి!

Tonga Island Tsunami: పసిఫిక్‌ సముద్రం అడుగున అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. జపాన్ లోని టోంగా అనే చిన్నద్వీపానికి సమీపంలో చోటుచేసుకున్న ఈ విస్ఫోటనం వల్ల సునామీ కెరటాలు విరుచుకుపడ్డాయి. జపాన్‌ నుంచి అమెరికా వరకూ పసిఫిక్‌ తీర ప్రాంతం మొత్తాన్నీ ఈ అలలు ముంచెత్తాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 11:32 AM IST
    • పసిఫిక్ సముద్రంలో పేలిన భారీ అగ్ని పర్వతం
    • జపాన్ లోని టోంగా దేశాన్ని తాకిన రాకసి అలలు
    • పలు దేశాల్లో సునామి హెచ్చరికలు జారీ
Tonga Island Tsunami: పసిఫిక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం.. టోంగా ద్వీపాన్ని తాకిన సునామి!

Tonga Island Tsunami: పసిఫిక్‌ మహాసముద్రంలో దక్షిణ భాగంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్ధలై తీవ్ర కలకలం సృష్టించింది. టోంగా అనే చిన్నద్వీప దేశానికి సమీపంలో చోటుచేసుకున్న ఈ విస్ఫోటం వల్ల సునామీ కెరటాలు విరుచుకుపడ్డాయి. జపాన్‌ నుంచి అమెరికా వరకూ పసిఫిక్‌ తీర ప్రాంతం మొత్తాన్నీ ఈ అలలు ముంచెత్తాయి. వీటి ధాటికి టోంగా రాజధాని నుకుఅలోఫా దెబ్బతింది. 

సునామీ ధాటికి జపాన్ లోని టోంగా ద్వీపంలో కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. అయితే ఆ నష్టం తీవ్రత ఎంతనే విషయం ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం సునామీ ముప్పు శాంతించినప్పటికీ అగ్నిపర్వత విస్ఫోటం ధాటికి ఏర్పడిన ధూళి మేఘం తగ్గలేదు. 

అగ్ని పర్వత విస్పోటకం ఎక్కడంటే?

'హుంగా టోంగా హుంగా హా అపై' అనే ఈ అగ్నిపర్వతం.. నుకుఅలోఫాకు 64 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం అగ్నిపర్వతం విస్ఫోటం చెందింది. దీనివల్ల పుట్టగొడుగు ఆకృతిలో బూడిద, నీటి ఆవిరి, వాయువులు పసిఫిక్‌ సాగర జలాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా పైకి ఎగిసినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. 

అగ్ని పర్వతం పేలిన శబ్దం.. 10వేల కిలోమీటర్ల దూరంలోని అలస్కా వరకూ వినిపించడం గమనార్హం. ఇది 5.8 తీవ్రతతో కూడిన భూకంపంతో సమానమని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. విస్ఫోటం వల్ల వెలువడిన బూడిద.. ఆకాశంలో దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తువరకూ ఆవరించింది. 

అగ్నిపర్వతం పేలుడు ధాటికి సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. టోంగాతో పాటు జపాన్‌, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కా సహా అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్‌ పసిఫిక్‌ తీర ప్రాంతంలో అలలు 1.2 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయి. వీటివల్ల పడవలు, తీరంలోని నిర్మాణాలు దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం మాత్రం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

Also Read: Corona Will Not Vanish: కరోనా వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుంది: డబ్ల్యూహెచ్​ఓ నిపుణులు

Also Read: Corona cases worldwide: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం- 32 కోట్లపైకి మొత్తం కేసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News