Dangers of Weight Gain Supplements : బరువు పెంచే సప్లిమెంట్స్ వాడుతున్నారా..??అది చాలా ప్రమాదకరం
ఎవరైతే వారి శరీరం దృడంగా ఉండాలని కోరుకుంటారో, వారు మరొక ఆలోచన లేకుండా బరువు పెరగడానికి పొడి మందులు ఉపయోగిస్తారు. వీటి వలన కలిగే దుష్ప్రభావాలు మరియు అపాయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
Dangers of Weight Gain Supplements: త్వరగా బరువు పెరగడానికి కృత్రిమ మందులు ఎంత సహాయపడతాయో, అంత దుష్ప్రభావాలు కూడా చూపిస్తాయి. కాని ఇది సరైన పద్ధతి కాదని నిపుణుల నమ్మకం. కావున వీటిని వాడటానికి ముందు వాటి వలన కలిగే అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ ల గురించి తెలుసుకోటం మంచిది.
బరువు పెరగడానికి మందులు ఎలా ఉపయోగపడతాయి?
ఈ మందులు వివిధ రకాల రుచులు మరియు వాసనలతో లభ్యమవుతాయి. వీటిని నీటిలో కరిగించి త్రాగడం వలన అతి తక్కువ సమయంలో శరీరంలో చాలా శక్తి విడుదల అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ వ్యాయామాలు చేయడానికి ఈ శక్తి చాలా ఉపయోగపడుతుంది. అలా చేయడం వలన తక్కువ సమయంలో మంచి దృడమైన శరీరం మీ సొంతమవుతుంది. ఆ మందులలో ఉండే ఉత్ప్రేరకం వలన శరీర నిర్మాణం వేగవంతం అవుతుంది. ఈ ఉత్ప్రేరకం ద్రవాభిసరణ ప్రక్రియతో కండరాలలోని కణాలకి నీటి అందించడం ద్వారా, ప్రోటీన్ల ఉత్పత్తి అవుతుంది.
Also Read: India Vs Pakistan: భారత్- పాకిస్తాన్ ఫైనల్ చేరాలని ఆకాంక్షుస్తున్న: సునీల్ గవాస్కర్
బరువు పెంచే మందులు ఎలాంటి వారు ఉపయోగించాలి?
ఈ మందుల వాడకం వలన చాలా రకాల అనారోగ్య పరిస్థితులకి దారి తీస్తాయి. ఇది చాలా మంది నిపుణుల పరిశోధనల్లో నిరూపించబడినది. సరైన పద్దతిలో మందులు వాడకపోతే, కండరాలకి తిమ్మిరి వస్తుంది మరియు విపరీతమైన దుష్ప్రభావాలకి దారి తీస్తుంది. మూత్రపిండాలకి సంబందించిన వ్యాధులు కూడా వస్తాయి. కాలేయ సమస్యలు, గుండె సమస్యలు, నిర్జలీకరణ సమస్య మరియు అతిసార వ్యాధికి కూడా దారి తీస్తుంది.
వీటిలో విటమిన్ సి మరియు ఐరన్ ఎక్కువగా ఉండడం వలన, విరేచనాలు మరియు కడుపులో వివిధ సమస్యలకి కారణమవుతాయి. ఇలాంటి అనారోగ్య పరిస్థితులకి దూరంగా ఉండడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి. ఎవరికైతే ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలు లేవో, మరియు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారో వారు ఈ మందులు కొంత వరకు వాడవచ్చు.
బరువు పెంచే మందుల వలన కలిగే అపాయాలు?
1) ముత్రపిండాలకి సంబందించిన సమస్యలు: మూత్రపిండాలలో రాళ్ల సమస్య రావడానికి ముఖ్య్ద కారణం అవుతుంది. సరైన పద్దతిలో బరువు పెంచే మందులో వాడకపోతే ఈ సమస్య వస్తుంది.
Also Read: Deepika Ranveer to Bid IPL Team: ఐపీఎల్ ప్రాంచైజీ రేసులో బాలీవుడ్ స్టార్ కపుల్..?? ఎంత వరకు నిజం?
2) కాలేయ సమస్యలు: మందులు తీసుకున్నపుడు ఎవరైతే ఆల్కహాల్ త్రాగి ఉంటారో వారిలో కాలేయ సమస్యలు కనబడతాయి. అవి చాలా ప్రాణాంతకమైనవి కూడా.
3) కండరాల తిమ్మిరి మరియు ఒంటి నొప్పులు: కొంత మంది ఇలాంటి మందులు వాడిన తర్వాత ఎంత చేస్తున్నారో తెలియకుండానే ఎక్కువగా వ్యాయామం చేస్తారు. దాని వలన శరీరానికి కావలిసినంత ద్రవాలు లభించవు. అందు వలన కండరాల తిమ్మిరికి మరియు నొప్పులకి కారణమవుతాయి.
4) శ్వాసకోశ సమస్యలు: సరైన పద్దతిలో మందులు వాడకపోతే శ్వాసకోశ సమస్యలు కనపడతాయి. దగ్గు, తుమ్ములు, గురక పెట్టడం మరియు ఆస్తమా కూడా వచ్చే అవకాశం ఉంది.
5) వాంతులు మరియు విరేచనాలు: తీసుకున్న మందులు సరిగా అరగకపోతే, కడుపులో ఆ మందులు అలాగే ఉండడం వలన వాంతులు మరియు విరేచనాలు సంభవిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook