Diabetes Diet:  డయాబెటిస్ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే మనిషి చనిపోయే వరకు అతన్ని వీడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే, ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం తప్ప దీనికి మనం చేసేదేమి ఉండదు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతక సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే.. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. దీనికి మన ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. లైఫ్‌ స్టైల్ మనం చేసుకునే కొన్ని మార్పలతో షుగర్ నియంత్రించవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.


గుడ్డు.. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తమ డైట్లో ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ గా గుడ్లను తీసుకుంటే త్వరగా ఆకలివేయదు. దీంతో రక్తంలో షుగర్ పెరగకుండా ఉంటుంది.


ఇదీ చదవండి: Bra and Breast Cancer: బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ వస్తుందా, నిజానిజాలేంటి


బెర్రీ పండ్లు..
ఈ పండ్లు ఎంతో ఆరోగ్యకరం బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ వంటివి డయాబెటిస్ తో బాధపడేవారు తమ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండక్స్ సూచికలు. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే శక్తి వీటికి ఉంటుంది. 


కమలపండు..
ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడేవారు ఆరెంజ్ ను తమ డైట్లో చేర్చుకోవచ్చు. బొప్పాయి పండుతో కలిపి ఆరెంజ్ ను తింటే మరింత ఆరోగ్యకరం.
ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ సీ ఉంటుంది. దీంతో షుగర్ లెవల్స్ ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అయితే, డయాబెటిస్ తో బాధపడేవారు ఏదైనా మోతాదుకు మించి తీసుకోరాదని గుర్తుంచుకోవాలి.


ఇదీ చదవండి: Mooli Paratha: మూలి పరాటా ఇలా చేస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలి అంటారు..


పెరుగు..
పెరగు ఆరోగ్యానికి మంచిది. దీన్ని మన ఆహారంలో ఏదో విధంగా చేర్చుకూనే ఉంటాం.
ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
చిరుతిండిగా తినడానికి ఇది మంచి ఎంపిక. నిజానికి ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఫైబర్ కూడా సరైన మొత్తంలో ఉంటుంది మరియు కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.


గింజలు..
గింజలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుడతాయి.


అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )