Cholesterol Reducing Foods: నేటికాలంలో మారిన ఆహార అలవాట్ల కారణంగా అతి చిన్న వయసులోనే ఉబకాయం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను అదుపు చేయడంలో విఫలం అవ్వడం. ఈ సమస్య వల్ల చాలా మంది తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మీరు ఎలాంటి మందులు, చికిత్సలు పొందకుండానే ఈ వ్యధి నుంచి సులభంగా బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. చెడు కొలెస్ట్రాల్‌ సమస్య నుంచి బయటపడడానికి మీరు కొన్ని రకమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఓట్స్‌ ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని బీటా గ్లూకాన్‌ అనే ఫైబర్‌  చెడు కొలెస్ట్రాల్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ ఫైబర్‌ సహాయంతో  చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టవచ్చు.  దీంతో పాటు నట్స్‌ను కొన్ని గింజలను తీసుకోవడం వల్ల మీరు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.  దీని కోసం మీరు బాదం, వాల్‌నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్‌లు, ఒమేగా-3 కలిగిన పదార్థాలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


అంతేకాకుండా ఆలివ్‌ నూనె, అవకాడో ఈ సమస్యకు గొప్ప మేలు చేస్తాయి. ఆలివ్‌ ఆయిల్‌లో ఒమేగా-9 వంటి కొవ్వ పదార్థాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి.  అవకాడోలో ఫైబర్‌, పొటాషియం ఉండటం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 


వీటితో పాటు కొన్ని రకమైన జ్యూస్‌లు తీసుకోవడం చాలా అవసరం. అందులో కొత్తిమీరతో తయారు చేసే జ్యూస్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి.  కరివేపాకును ఉపయోగించడం  వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్‌ను సులువుగా కరిగిస్తుంది.  


చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టే ఇతర మార్గాలు: 


వారానికి ఎక్కువగా 150 నిమిషాల పాటు వ్యాయామం లేదా 75 నిమిషాల వాకింగ్‌ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవాలి. మీరు ధూమపానం , మద్యం వంటి అలవాట్లు కలిగిన వారు అయితే వెంటనే వాటిని మానుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


గమనిక: 


మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిల గురించి ఆందోళన చెందుతుంటే, మీ వైద్యుడితో మాట్లాడండి. వారు మీకు వ్యక్తిగతీకరించిన సలహా ఇవ్వగలుగుతారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి