Health Food for Winters: కాలం మారగానే వాతావరణ మార్పుల వలన మన శరీరంలో మార్పులు కూడా సహజమే.. ముఖ్యంగా చలి కాలం రాగానే జలుబు, దగ్గు వంటివి ఆందోళన మనల్ని ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో చలి తీవ్రంగా ఉన్నపుడు.. వచ్చే వ్యాధుల రక్షించుకోటానికి మనం చాలానే మార్పులు చేస్తుంటాం. ధరించే దుస్తువులే కాదు.. పాటించే జీవనశైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా చలికాలంలో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికాలంలో శరీరానికి వెచ్చదనం కావాలి.. ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే డైట్ లో మార్పులు చేసుకోవటం ద్వారా శరీరానికి కావలసిన వేడి పుట్టించవచ్చు. ఇలాంటి ఆహారాలను మనం పాటించే డైట్ కూడా చేర్చుకోవచ్చు. వీటి వలన శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు. ఏయే ఆహారాలు చలికాలంలో మీకు ఆరోగ్యాకరంగా ఉంటాయో ఇపుడు తెలుసుకుందాం


బెల్లం..
చాలా మందికి భోజనం చేసిన తర్వాత ఏదైనా తీపి తినాలనిపిస్తుంది. చలికాలంలో కూడా తిన్న తర్వాత స్వీట్ దొరికితే మరింత ఆనందం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో బెల్లం తినవచ్చు. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం తినడం వల్ల శరీరంలో వేడి నిల్వ ఉంటుంది. అదనంగా, శరీరంలో ఐరన్ లోపం ఉంటే కూడా ఆ కొరత తీరిపోతుంది. చలికాలంలో రాత్రి పడుకునే ముందు బెల్లం తింటే రక్తహీనత బారినపడకుండా కాపాడుతుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. రోజూ బెల్లం తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


దేశీ నెయ్యి..
దేశీ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిందే!. చలికాలంలో దేశీ నెయ్యి కలిపి ఎలాంటి పప్పులైనా తినవచ్చు. రోజు తినే రోటీ, పరోటా లేదా బ్రేడ్ వాటి పైన కూడా నెయ్యి రాసుకొని తింటవచ్చు. నిజానికి, నెయ్యి సులభంగా జీర్ణమవుతుంది. నెయ్యి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. దేశీ నెయ్యి చలి కాలంలో జలుబు మరియు దగ్గు నుండి కూడా రక్షిస్తుంది. కానీ ఎక్కువ మోతాదులో నెయ్యి తిన్నా కూడా సమస్యలు తలెత్తుతాయి. 


Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  


తేనె..
తేనె అంటే మనలో చాలా మందికి ఇష్టమే.. చలికాలంలో తేనెను ఆహారంలో సులభంగా కలుపుకోవచ్చు. ఎందుకంటే తేనెలో శరీరానికి వేడి అందించే గుణాలు ఉన్నాయి. జలుబు, దగ్గు తగ్గించటానికి కూడా తేనెను ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తేనెను పరిగణిస్తుంటారు. వీటితో పాటుగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కూడా తేనె కలిగి ఉంటుంది. 


Also Read: Moto Edge 40 Price: దీపావళి సేల్‌లో Moto Edge 40 రూ.24,830 వరకు తగ్గింపు..డిస్కౌంట్‌ వివరాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..