White Hair Reverse Juices: వైట్ హెయిర్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. దీనికి వివిధ ఉత్పత్తులు వినియోగిస్తూ ఉంటారు, జెనెటిక్, హార్మోనల్ , లైఫ్ స్టైల్ లో మార్పుల వల్ల ఈ వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతుంటారు. ఆహారంలో విటమిన్స్ లేమి కూడా ఈ సమస్యకు కారణం. అయితే కొన్ని రకాల ఆహారాలు వైట్ హెయిర్ సమస్యను రివర్స్ చేసి ఒక వరంల మారుస్తాయి. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ పిగ్మెంటేషన్ రాకుండా చెక్ పెడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలకూర..
ఈ ఆరోగ్యకరమైన ఆకుకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే పాలకూర తీసుకోవటం వల్ల స్కాల్ప్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అంతేకాదు ఐరన్ లేమి తో బాధపడే వరకు ఇది ఒక వరం వంటిది ఈ పాలకూరని డైట్లో చేర్చుకోవడం వల్ల ప్రీమియర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు పాలకూరలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి.


క్యారెట్..
క్యారెట్లలో కూడా బీటా కెరోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ ఏ లోకి మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటి సమస్యలకే కాకుండా క్యారెట్ తీసుకోవడం వల్ల వైట్ హెయిర్ సమస్య కూడా చెక్ పెట్టవచ్చు ఇది సెబమ్ ఉత్పత్తిని నివారిస్తుంది ఆరోగ్యకరమైన కుదుళ్లకు సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు పొడిబారకుండా ,త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.


బీట్రూట్..
ఆరోగ్యకరమైన ఆహారంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్ సి ఉంటుంది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది పిగ్మెంటేషన్ రాకుండా నివారిస్తుంది తెల్ల జుట్టు నాచురల్ గా నలుపుదనంలోకి మారేలా చేస్తుంది.


ఉసిరి..
ఉసిరిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆయుర్వేదిక మెడిసిన్ లో విపరీతంగా ఉపయోగిస్తారు చుట్టూ ఆరోగ్యానికి పెరుగుదలకు తోడ్పడుతుంది, ఉసిరి డైట్ లో చేర్చుకోవడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్యకు చెక్ పెట్టవచ్చు న్యాచురల్ గా పిగ్మెంటేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.


అల్లం..
అల్లం యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇది కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలను ఆలస్యం చేస్తుంది.


ఇదీ చదవండి: తల్లి డ్యాన్సర్‌.. తండ్రి స్టార్‌ క్రికెటర్‌.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్‌ ఏంటో తెలుసా?


నిమ్మకాయ...
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది సీట్రస్ పండు కాబట్టి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది.


పుదీనా..
పుదీనా ఆకులు కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నివారిస్తుంది తెల్ల వెంట్రుకలు సమస్య రాదు.


కొబ్బరినీరు..
కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఆరోగ్యకరమైన కుదుళ్ల , జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది పొడిబారకుండా నివారిస్తుంది
వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ అందుతాయి శరీర జీర్ణక్రియకు తోడ్పడుటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కంటి ఆరోగ్యానికి కూడా ఈ ఆహారాలు సహాయపడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి: మీ ఇంట్లో నివసించే ఈ చిన్న జీవి పాము కంటే ప్రమాదకరం! ఏటా 10 లక్షల మందిని చంపేస్తుంది!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook