Thyroid care Tips: థైరాయిడ్ నియంత్రణలో అద్భుతమైన 4 డ్రింక్స్
Thyroid care Tips: థైరాయిడ్ అనేది మనిషి శరీరంలో ఓ కీలకమైన గ్రంథి. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా థైరాయిడ్ సమస్య ఉత్పన్నమౌతుంది. థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందాలంటే..డైట్‌లో కొన్ని డ్రింక్స్ చేర్చాల్సిందే.
ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్య ఎక్కువౌతోంది. ఫలితంగా ఆ థైరాయిడ్ హార్మోన్ ప్రభావం శరీరంలోని అన్ని భాగాలపై పడుతుంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
థైరాయిడ్ అనేది మెడభాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆందోళన, స్థూలకాయం, చెడు జీవనశైలి కారణంగా థైరాయిడ్ సమస్య తలెత్తుతుంటుంది. అయితే డైట్‌లో కొన్ని రకాల డ్రింక్స్ చేర్చడం ద్వారా థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చు. థైరాయిడ్ రోగులు ఏయే డ్రింక్స్ డైట్‌లో చేర్చుకోవాలో తెలుసుకుందాం..
థైరాయిడ్ రోగులు తీసుకోవల్సిన డ్రింక్స్
థనియా నీళ్లు
థైరాయిడ్ రోగులు ధనియా నీరు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే ధనియా నీళ్లతో థైరాయిడ్ సమస్యను నియంత్రించవచ్చు. ఒక గ్లాసు నీళ్లలో ధనియాల వేసి ఉడికించాలి. ఆ తరువాత ఆ నీళ్లను వడపోసి తాగాలి. రోజూ ఉదయం వేళ ఇలా తాగుతుంటే..బరువు తగ్గడమే కాకుండా..థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అందుకే రోజూ ధనియా నీళ్లను తాగాలి.
తేనె-నిమ్మ నీళ్లు
నిమ్మకాయ రసం మంటి డీటాక్సింగ్ ఏజెంట్. ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. థైరాయిడ్ రోగులు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. దీనికోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని..అందులో నిమ్మరసం కొద్దిగా వేసి తేనె కలుపుకుని తాగాలి. రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
కూరగాయల జ్యూస్
హైపోథైరాయిడిజమ్ సమస్య ఉంటే..రోజూవారీ డైట్‌లో కూరగాయల జ్యూస్ భాగంగా చేసుకోవాలి. ఆనపకాయ, కాకరకాయ జ్యూస్ కలిపి తాగాలి.
గిలోయ్
థైరాయిడ్ రోగులకు గిలోయ్ కాయల జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో గిలోయ్ కాయలేసి ఉడికించాలి. ఆ తరువాత వడపోసి తాగాలి. గిలోయ్ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది.
Also read: Cholesterol Symptoms: గోర్ల రంగు మారిందా, చేతులు నొప్పెడుతున్నాయా...అయితే ఆ సమస్య కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook