Chai Making Tips: మన దేశంలో చాయ్​కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత బిజీగా ఉన్నా.. చాలా మంది రోజుకు కనీసం రెండు సార్లు చాయ్​ తాగుతుంటారు. తలనొచ్చినా.. పని పెరిగినా.. అలసటగా అనిపించినా.. ఇలా అనేక చిన్న చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం ఓ కప్పు టీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీకి ఉన్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని.. దేశవ్యాప్తంగా ఏ గల్లీలో చూసినా (ముఖ్యంగా పట్టణాల్లో) కనీసం ఒక టీ పాయింట్​ ఉంటుంది. ఈ మధ్య టీ పాయింట్లు బ్రాండ్​ల పేరుతో కూడా వస్తున్నాయి.


ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే.. చాయ్​లో రకరకాలు ఉన్నాయి. సాధారణ టీ, అల్లం టీ, తందూరీ చాయ్​.. ఇలా చాలానే ఉన్నాయి.


అందులో మసాలా చాయ్​ గురించి ప్రత్యేకించి చెప్పాలి. మసాలా చాయ్​ని చాలా మంది చాలా ఇష్టంగా తాగుతుంటారు. అయితే దానిని తయారు చేయడం తెలియకుంటే.. దానిని పూర్తిగా ఆస్వాదించలేరు. మరి మసాలా చాయ్​ను అద్భుతంగా తయారు చేయాలంటే ఎలానో తెలుసుకుందామా?


మసాలా చాయ్​ పర్ఫెక్ట్​గా ఎలా చేయాలంటే..


1.ఆకులు తాజాగా ఉంటేనే..


మీరు చాయ్ చేసేందుకు ఉపయోగించే తేయాకులు పాతవైనా, తడిగా ఉన్నా వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఒక వేళ ఆ ఆకులు ఎక్కువ రోజులుంటే అవి.. వాటి రంగు, రుచి, వాసనను కోల్పోతాయి. తేయాకులు ఎంత తాజాగా ఉంటే చాయ్ అంత బాగుటుంది.


2. స్టోర్​ చేయడంలో తప్పులు..


టీ ఆకులు చాలా సున్నితంగా ఉంటాయి. అవి ఇతర వస్తువుల దగ్గర ఉంచితే అత్యంత త్వరగా పాడవుతాయి. ఇంకా చెప్పాలంటే.. కొద్ది సేపు గాలిలో ఉంచినా.. అవి దాని పరిమళాన్ని కోల్పోతాయి. అందుకే తేయాకులను గాలి కూడా చొరబడటానికి వీలు లేకుండా నిల్వ చేయాలి. అప్పుడే అవి పూర్తిగా సురక్షితంగా ఉంటాయి.


3.ఎక్కువగా మరిగించకండి..


పాలు లేకుండా మీరు మసాలా చాయ్​ చేసేందుకు పెద్ద పెద్ద ఆకులను ఉపయోగిస్తుంటే.. ఆ ఆకులను మరగబెట్టడం మానుకోండి. దానికి బదులు మీకు నచ్చిన మసాలాతో నీటిని మరగబెట్టి.. మంటను ఆర్పండి. ఆ తర్వాత తేయాకులను అందులో వేసి వెంటనే మూత మూసేయండి. ఆ తర్వాత 4 నిమిషాలు ఆగి.. ఆ టీని తాగండి. ఇలా చేస్తే తేయాకులో ఉండే అన్ని రకాల ఫ్లేవర్స్​ను మీరు అస్వాధిస్తారు. అధికంగా మరిగించడం వల్ల వాటిలో చాలా వరకు విలువైన పరిమళాలను కోల్పోతాయి.


4. పాలతో చేయాలనుకుంటే..


పాలతో మసాలా టీ చేయాలనుకుంటే.. ముందు పాలను మసాలాలతో కలిపి బాగా మరిగించండి. ఆ తర్వాత దానిని చల్లార్చి.. ఆప్పుడు తేయాకులను ఉపయోగించి టీ తయారు చేయడం ప్రారంభించండి. 


5.మసాలా ఎప్పుడు కలపాలో తెలిసి ఉంటేనే టీకి అసలైన రుచి..


మసాలా టీని పూర్తిగా ఆస్వాదించాలంటే ముందుగా కచ్చితంగా తెలిసి ఉండాల్సిన విషయం ఏమిటంటే.. మసాలా ఎప్పుడు కలపాలి? అనేది.


టీ తయారు చేసే ముందు పాలు/నీళ్లు బాగా మరుగుగుతున్నప్పుడు మసాలాలు వేయాలి. అయితే మసాలాలను మీరు పౌడర్ రూపంలో వాడుతుంటే మాత్రం తేయాకులు వేసేకన్నా కొన్ని నిమిషాల ముందు పౌడర్​ను కలపాలి. మంట ఆర్పిన తర్వాత తేయాకులు వేసి.. మళ్లీ 2 నిమిషాల వరకు ఆగాలి. ఇప్పుడు మీ మసాలా టీ రెడీ అయిపోయినట్లే.


మరి మసాలా టీని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారుగా.. ఈ చిట్కాలన్నీ పాటిస్తూ టీ తయారు చేసి ఎలా ఉందో ట్రై చేయండి. చాయ్​ పెట్టడంలో స్పెషలిస్ట్ అయిపోండి.


Also read: Sitaphal Benefits: ఈ సీజన్‌లో సీతాఫలాలు తిన్నారా..త్వరగా తినండి..సీజన్ ముగిసిపోతోంది..


Also read: Tulsi Water Benefits: తులసి నీళ్లు చల్లడం కాదు..తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook