Holi Tips: హోలీ మన దేశంలో జరుపుకునే అతిపెద్ద పండుకల్లో ఇది కూడా ఒకటి, కరోనా కారణంగా గత రెండేళ్లుగా హోలీని చాలా సంబురాలు లిమిటెడ్​గా జరిగాయి. ఈ సారి కొవిడ్ ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఘనంగా హోలీని జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. అయితే హోలీ జరుపుకున్న మీ చర్మం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఆనందంగా పండుగను జరుపుకున్నా.. ఆ తర్వాత ఎలాంటి చర్మ సంబంధి సమస్యలు రాకుండా చూసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోలీ జరుపుకోవడంలో జాగ్రత్తలు..


హోలీ పండుగకు ముందు ఎలాంటి చర్మ సంబంధి చికిత్స తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కనీసం వారం ముందు నుంచి ఫేసియల్​, పీల్స్​ లేసర్, బ్లీచింగ్ వంటివి చేయించుకోవద్దని సూచిస్తున్నారు. అలా చేసి.. హోలీ అడటం వల్ల.. రంగుల కారణంగా చర్మంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.


హోలీ రోజు.. ముందుగా చర్మానికి, జుట్టుకు నూనె రుద్దుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా కొబ్బరి, ఆలీవ్​, బాదాం నూనెను రుద్దుకోవడం ద్వారా రంగుల నుంచి రక్షణగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మాన్ని రంగుల నుంచి సులభంగా శుభ్రం చేసుకోవచ్చని వివరిస్తున్నారు.


హోలీ రోజు మీరు ఉపోయోగించే రంగులు ఆర్గానిక్​, సహజమైనవే ఉండేలా చూసుకోవడం ఉత్తమం. సింథటిక్​, డార్క్​ కలర్స్ వాడొద్దని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు.


శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచే బట్టలు పెట్టుకోవడం ఉత్తమమని చెబుతున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల రంగులు శరీరంపై పడే అకకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండ తడి బట్టలతో ఎక్కు్వ సేపు ఉండకూడదని సలహా ఇస్తున్నారు.


హోలీ ఆడిన తర్వాత.. వేడి నీళ్లతో స్నానం చేయాలి వైద్య నిపుణులు చెబుతున్నారు. బాడీ సోప్​, షాంపు వంటివి వాడి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సమయంలో జుట్టు, శరీరాన్ని బలంగా రుద్దొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అలా చేయడం వల్ల చర్మం పాడవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. మరీ ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ హోలీని జరపుకుంటే.. ఆనందానికి ఆనందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం!


Also read: Dieting: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఇవి తప్పకుండా తినండి


Also read: Weight Gain Tips: బరువు పెరిగేందుకు ఐదు సులభమైన మార్గాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook