Weight Gain Tips: బరువు చాలా మందికి సాధారణంగా ఉండే సమస్య. అందరికి అధిక బరువే సమస్యగా ఉండదు. కొంత మందికి తక్కువ బరువు ఉండటం కూడా సమస్యగా ఉంటుంది. లావు పెరగాలని, ఆకర్షణీయమైన బాడీ మెయింటెయిన్ చేయాలని చాలా మందికి ఉంటుంది. సాధారణంగా బరువు తగ్గేందుకు అనేక చిట్కాలు తరచూ వింటుంటాం. కానీ ఇప్పుడు బరువు పెరగాలనుకునే వారికోసం ఉపయోగపడే కొన్ని టిప్స్‌ను పరిశీలిద్దాం.
బరువు పెరిగేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అందులో త్వరగా బరువు పెరిగేందుకు ఉపయోగించే ట్రిక్స్ సైడ్ ఎఫెక్ట్స్‌కు దారితీయొచ్చు. అలా కాకుండా వేగంగా, సురక్షితంగా బరువు పెరగటం ఎలానో ఇప్పుడు చూద్దాం.
1.అధిక క్యాలరీస్ ఉన్న ఆహారం తినడం..
మీ శరీరం ఉపయోగించుకునేదానికంటే.. ఎక్కువ క్యాలరీస్‌ను తీసుకోవాలి. దీని ద్వారా శరీరం బర్న్ చేసిన క్యాలరీస్ తర్వాత మిగతా మొత్తం బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
2.ప్రొటిన్ రిచ్ డైట్..
ప్రొటిన్స్ అనేవి శరీరంలో ఖండరాల వృద్ధికి తోడ్పడతాయి. అందుకే ఎక్కువ ప్రొటిన్లు ఉండే ఆహారం తీసుకోవడం ఖండరాల వృద్ధి వేగంగా జరుగుతుంది.
3.కొవ్వు అధికంగా ఉండే ఆహారం..
శరీరానికి ఉపయోగపడే కొవ్వు ఆహారాలు తరచూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు కార్బొహైడ్రేట్లు కూడా అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అరటి పండ్లు, బ్లూ బెర్రీస్, ఎర్రగండలు, డార్క్ చాక్లెట్ల వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రతి రోజు పాలు కూడా తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
4.వ్యాయామం కూడా..
బరువు పెరగాలంటే.. ఆహారంతో పాటు సరైన వ్యాయామం కూడా అవసరమని చెబుతున్నారు విశ్లేషకులు. ప్రధానంగా క్రమం తప్పకుండా వెయిట్ లిఫ్టింగ్ చేస్తే బరువు పెరిగినా.. అది పొట్ట భాగంలో కాకుండా.. చేతి ఖండారాలకు వ్యాపిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
5. శరీరానికి విశ్రాంతి..
చివరగా ఆహారం, వ్యాయామం మాత్రమే కాకుండా.. బగరువు పెరగాలంటే శరీరానికి తగినంత విశ్రాంతి కూడా ఇవ్వాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే సమయానికి నిద్రపోవడం అవసరని చెబుతున్నారు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండటం కూడా బరువు పెరిగేందుకు అవసరమని అంటున్నారు. అందుకే మనస్సును అదుపులో ఉంచుకునేందుకు యోగా చేయాలని సూచిస్తున్నారు. ఈ సూచనలన్నీ పాటిస్తే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
నోట్: ఈ కథనంలోని అంశాలు పూర్తిగా నిపుణుల అభిప్రాయాలు మత్రమే. ఒకవేల బరువు పెరగాలనుకునే వారు ఈ సలహాలు పాటించాలనుకుంటే.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించాచడం మేలు.
Also read: Knee Pain Remedies: ఈ పండ్లు తింటే కీళ్ల నొప్పులు, వాపులు తప్పకుండా తగ్గుతాయి!
Also read: Finger Millets: రాగులతో అద్భుత లాభాలు, కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook