నారింజను చాలా మంది జ్యూస్ చేసుకుని తాగుతారు. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతీ సీజన్ లో ఇష్టపడుతుంటారు. అయితే చలికాలంలో  దీనిని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ప్రతీ రోజు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ( Health ) మీ సొంతం అవుతుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు


తాజా నారింజను తినడం వల్ల తాజాదనం అనుభూతి కలుగుతుంది. అందు్కే పొద్దునే ఆల్పాహారం ( Breakfast) పూర్తి చేసిన తరువాత.. లేదా మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక గ్లాసు ఆరెంజ్ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కలిగే లాభాలివే..


* నారింజ పండు.. పోషకాలలో మెండు అంటారు. ఇందులో చాలా తక్కువ పాళ్లలో కేలరీస్ ఉంటాయి. నారింజలో ఎలాంటి సెచ్యురేటెడ్ ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఉండదు. అంతేకాదు ఇందులో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఉన్న విషతుల్యాలు బయటికి వెళ్లిపోతాయి.



ALSO READ| Almonds: పోషకాలం గోదాం.. బాదాం


* ఆరెంజ్ ( Orange ) వల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా, చక్కగా పని చేయడం మొదలు పెడుతుంది. నారింజలో అత్యధిరంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ, బత్తాయి కూడా సిట్రస్ ఫ్రూట్సే.


* సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ తత్వాలు నారింజలో ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. స్డామినా పెంచుతుంది.


* ఇందులో ఫైబర్ విమటిన్ సీ కూడా అధికంగా ఉంటుంది. నారింజ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దాంతో బరువు పెరిగే సమస్యను చెక్ పెట్టవచ్చు.



ALSO READ|  Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు


* నారింజ వల్ల విటమిన్ బీ కాంప్లెక్స్ కూడా ఎక్కువగా లభిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తపోటును నియంత్రించడంలో నారిజలో ఉండో పోషకతత్వాలు ఉపయోగపడతాయి. యముకలు పటిష్టం అవుతాయి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR