Insomnia: మనిషి ఆరోగ్యానికి సరైన పోషకాహారమే కాదు అవసరమైనంత నిద్ర కూడా అంతే అవసరం. ఆ నిద్రే లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిద్రలేమితో ఇబ్బందిపడేవారు ఈ చిట్కాలు పాటించి చూస్తే మంచి ఫలితాలుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషికి రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కొంతమంది పనిలో పడి నిద్రను త్యాగం చేస్తుంటారు. నిద్రాహారాలు మానేసి చేస్తున్నామని చెబుతుంటారు. ఇలా ఎన్నడూ చేయకూడదు. అయితే చాలామందికి వివిధ కారణాలతో రాత్రిళ్లు త్వరగా నిద్రపట్టదు. బెడ్‌పై గంటల కొద్దీ దొర్లుతూనే ఉంటారు కానీ నిద్రపోలేరు. కళ్లు మూసుకున్నా ఏదో ఆలోచనలు వెంటాడుతూ నిద్ర రావడం లేదని లేచిపోతుంటారు. ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో నిద్ర పడుతుంది. కొందరికి అది కూడా పట్టదు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇలా నిద్రపట్టక బాధపడేవారు ఈ టిప్స్ పాటిస్తే వెంటనే నిద్రపడుతుంది. అవేంటో చూడండి.


రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరో పద్ధతి కూడా ఉంది. గసగసాల్ని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించి వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకల్ని మృదువుగా దువ్వుతూ లేదా చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసినా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా మంచి నిద్ర పడుతుంది. అలా కాదనుకుంటే రాత్రి పూట గోరు వెచ్చని పాలు..మిరియాల పౌడర్ కలుపుకుని తాగాలి. వాస్తవానికి ఈ అలవాట్లన్నీ కొత్తవేమీ కావు. ఆధునిక పోటీ ప్రపంచంలో పడి మర్చిపోయినవే. పాతకాలంలో ఆచరించినవే.  


మరీ ముఖ్యంగా నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం పూర్తిగా మానేయాలి. అంతేకాదు రాత్రిళ్లు తల పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావంతో కూడా సరిగ్గా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ ఫోన్‌ను దూరంగా పెట్టడం చాలా మంచిది.


Also read: Causes of Fatigue: మీకు పదే పదే అలసటగా అనిపిస్తుందా..అందుకు కారణాలేంటో తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook