Ragi Dosa Making Process: సాధారణంగా మనం ఇంట్లో రాగిపిండితో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుంటాం. అయితే రాగిపిండితో చేసే వంటకాలను తీనడం వల్ల  ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అయితే రాగిపిండితో దోశ‌ను త‌యారు చేయ‌డం వల్ల ఎన్నో మేలు జరుగుతుంది. ఈ రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దోశ‌ను త‌యారు చేసుకోవడానికి ముందుగా  రాగి పిండిని, పావు కప్పు రవ్వ, ఒక టేబుల్‌ స్పూన్  బియ్యంపిండి, త‌గినంత‌ ఉప్పు, పావు క‌ప్పు పెరుగు పదార్థాలను తీసుకోవాలి. ఈ పదార్థాలతో దోశ ఇలా చేయాలి..


ముందుగా గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి.  ఇందులో ర‌వ్వ‌, బియ్యంపిండి, పెరుగు , ఉప్పు వేసి క‌ల‌పాలి. తరువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. దోశ పిండి తయారు చేసుకోవాలి. 15 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.  దోశ వేసేట‌ప్పుడు పెనం కొద్దిగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. త‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ‌ను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రాగి దోశ త‌యార‌వుతుంది.


ఈ విధంగా రాగి పిండితో దోశ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Sperm Count: ఈ గింజలు మగవారి శక్తిని అమాంతం పెంచుతాయి..వీర్యకణాల సంఖ్య కూడా బూస్ట్ అవుతుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter