Tulsi Leaves: ఆరోగ్యానికి అమృతమే..రోజూ పరగడుపున తీసుకుంటే ఏ వ్యాధులకు చెక్ పెట్టవచ్చో తెలుసా
Tulsi Leaves: తులసి మొక్కకు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద వైద్యపరంగా చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఒక్క తులసి ఆకులతో ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్యులు. ఆ వివరాలు మీ కోసం..
తులసి మొక్క ఆకుల్ని ప్రతిరోజూ ఉదయం తినడం అలవాటు చేసుకుంటే..శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం, ఒత్తిడి, ఆందోళన, జలుబు, ఎముకల బలహీనత వంటి సమస్యల్ని దూరమౌతాయి. అటు ఇమ్యూనిటీ కూడా మెరుగుపడుతుంది.
హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలున్నాయి. తులసి ఆకుల్ని పరగడుపున సేవిస్తే చాలా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులతో ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనేది తెలుసుకుందాం..
మలబద్దకం సమస్యకు చెక్
మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే..తులసి ఆకులు మంచి ప్రత్యామ్నాయం. తులసి ఆకులు ఈ సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి. పరగడుపున తులసి ఆకుల్ని సేవిస్తే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. తులసి ఆకులు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
ఒత్తిడి
ఒకవేళ మీరు ఒత్తిడితో సతమతమవుతుంటే..తులసి ఆకుల్ని సేవించడం ద్వారా ఈ సమస్యను జయించవచ్చు. రోజూ పరగడుపున తీసుకుంటే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుండె ఆరోగ్యం
తులసి ఆకుల్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున సేవిస్తుంటే మీ గుండె సురక్షితంగా ఉంటుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఎముకల బలహీనత
రోజూ పరగడుపున తులసి ఆకుల్ని తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టమౌతాయి. తులసిలో ఉండే పొటాషియం, ఫోలెట్ ఇందుకు దోహదపడతాయి. అంతేకాకుండా రోజూ పరగడుపున తులసి ఆకుల్ని తీసుకుంటే..చాలా ప్రయోజనాలున్నాయి. జలుబు దూరమౌతుంది. కేన్సర్ నియంత్రణలో కీలకంగా ఉంటుంది. శ్వాస నుంచి చెడు వాసన పోతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
Also read: Thyroid care Tips: థైరాయిడ్ నియంత్రణలో అద్భుతమైన 4 డ్రింక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook