Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్యూరీన్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది, వైద్య ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం యూరిక్ యాసిడ్ తగ్గించుకోకపో తే కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. అంతేకాదు యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ల నొప్పుల వాతం చేస్తుంది. మన వంటగది మసాలాలతో కూడా యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కొన్ని మెడిసినల్ గుణాలు ఉంటాయి కాబట్టి సమర్థవంతంగా తగ్గుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు...
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి గాయాలను మారుస్తుంది. పసుపును డైట్ లో చేర్చుకోవడం వల్ల యూరిక్ ఆసిడ్ స్థాయిలు తగ్గిపోతాయి. వెయిట్‌ లాస్ జర్నీలో ఉన్న వాళ్లు కూడా పసుపు నువ్వు తీసుకుంటారు. పసుపు తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి.


వెల్లుల్లి..
వెల్లుల్లి అల్లీసిన్ ఉంటుంది ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతే కాదు వెల్లుల్లి డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి. అయితే వెల్లుల్లి తరచూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలో కూడా చెక్ పెడుతుంది. రోజు వారి ఆహారంలోనూ వెల్లుల్లి చేర్చుకోవాలి.


దాల్చిన చెక్క..
దాల్చిన చెక్కను న్యాచురల్ ఇన్సులిన్ అంటారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. అయితే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా దాల్చిన చెక్క ఎంతో మంచిది. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోవడంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. దాల్చిన చెక్కను మనం వివిధ వంటల్లో ఉపయోగిస్తాం.


ఇదీ చదవండి:  ఈ స్కీమ్‌లో డబ్బులు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తే.. 7.90 శాతం వడ్డీ, పూర్తి వివరాలు ఇవే..  


మెంతులు..
మెంతుల్లో కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే గుణం ఉంటుంది. వీటిని మనం రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల సమర్థవంతంగా పనిచేస్తుంది. మెంతులు బెల్లీ ఫ్యాట్ కరగదీస్తుంది. మెంతులు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం పరగడుపున తీసుకోవటం వల్ల ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. అంతేకాదు మెంతి పొడిని కూడా మనం తీసుకునే ఆహారంలో చేర్చుకోవచ్చు ఆహారంలో మెంతి గింజలు విరివిగా ఉపయోగిస్తాం. దీంతో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి మెంతులు చర్మానికి జుట్టుకు కూడా మేలు చేస్తాయి.


ఉసిరికాయ
ఉసిరికాయ సీజన్లో విరివిగా దొరుకుతుంది ఎందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ఉసిరితో కూడా యూరిక్ ఆసిడ్ స్థాయిలు తగ్గిపోతాయి. ఉసిరి ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు యూరిక్ ఆసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. ఉసిరికాయ కిడ్నీ పనితీరును మెరుగు చేస్తుంది ఉసిరి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేస్తుంది వ్యాధులు రాకుండా చెక్ పెడుతుంది


ఇదీ చదవండి:  డీఆర్‌డీఓ బంపర్‌ ఆఫర్.. ఏ రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కొలువు, రూ.1,00,000 జీతం...


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.