యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరమైంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. యూరిక్ యాసిడ్ పెరిగితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే యూరిక్ యాసిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కిడ్నీలు సాధారణంగా యూరిక్ యాసిడ్‌ను ఫిల్టల్ చేసి బయటకు పంపించేస్తాయి. కిడ్నీలు విఫలమై ఆ పని జరగనప్పుడు ఆ యూరిక్ యాసిడ్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దాంతో స్థూలకాయం, ఎముకల స్వెల్లింగ్, తిరిగేటప్పుడు నొప్పులు ఎదురౌతాయి. యూరిక్ యాసిడ్ పెరిగితే శరీరంలోని పలు భాగాల్లో నొప్పులు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పులుంటాయో తెలుసుకుందాం..


యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు


మోకాలి నొప్పులు


యూరిక్ యాసిడ్ పెరిగితే మోకాళ్లలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ సమస్య అదేపనిగా ఉంటుంది. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్లు లాగుతుంటాయి. దాంతో మోకాలి నొప్పులు సంభవిస్తాయి. ఈ నొప్పి ఒక్కోసారి ఎంత తీవ్రంగా ఉంటుందంటే కనీసం అడుగేయలేని పరిస్థితి ఉంటుంది. మీక్కూడా ఈ ఇబ్బంది తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


మడమ నొప్పులు


శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే క్రిస్టల్ రూపంలో ఎముకల్లో పేరుకుపోతుంది. ఎముకల మధ్యలో పేరుకుపోవడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. మీక్కూడా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది యూరిక్ యాసిడ్ సమస్య కావచ్చు.


నడుము నొప్పి


నడుములో నొప్పి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు నడుము భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. 


మెడ నొప్పి


మెడనొప్పి సాధారణమైన లక్షణమే అయినా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మెడభాగంలో నొప్పి లేదా పట్టేసినట్టుంటే యూరిక్ యాసిడ్ సమస్య కావచ్చు.


Also read: Ajwain Tea: రోజూ ఉదయం పరగడుపున వాము టీ తాగితే చాలు..ఇవీ ప్రయోజనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook