UTI Problem: ఇటీవలి కాలంలో యూరినరీ ట్రాక్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కన్పిస్తోంది. అసలీ సమస్య ఎందుకు ఏర్పడుతుంది, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూటీఐలో చాలా రకాల సమస్యలు ఏర్పడతాయి. మూత్రాశయ సంక్రమణ, మూత్రపిండాల సంక్రమణ ముప్పు ఏర్పడుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్‌కు చాలా కారణాలున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోయినా, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తరచూ తీసుకుంటున్నా లేదా యూరినరీ ట్రాక్‌లో రాళ్లు ఏర్పడినా లేదా వేడి చేసినా ఈ సమస్య ఏర్పడుతుంది. అన్నింటికీ మించి ఇన్‌ఫెక్షన్ కారణంగా యూటీఐ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 


యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ ఉంటే శరీరంలో చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, తరచూ మూత్రం రావడం, మూత్రంలో రక్తం, కటి నొప్పి, కిడ్నీ సమస్య, నడుము నొప్పి బాధిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు రావల్సి ఉంటుంది. సాధ్యమైనంతవరకూ ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మూత్రనాళంలో ఉండే బ్యాక్టిరియా, విష పదార్ధాలు తొలగిపోతాయి. అందుకే సాధ్యమైనంతవరకూ కాఫీ, టీలు తగ్గించాలి.


ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. వీటివల్ల ఇమ్యూనిటీ పెరిగి వ్యాధులతో పోరాడే సామర్ధ్యం వస్తుంది. రోజూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీనాల్సి ఉంటుంది. ఫైబర్ ఫుడ్ తినడం వల్ల జీర్ణక్రియ సులభమై శరీరంలోని విష పదార్ధాలు బయటకు పోయి, ప్రేవులు శుభ్రమౌతాయి. దీనికోసం అరటి పండ్లు, జీన్స్, కాయగూరలు, తృణ ధాన్యాలు, గింజలు తీసుకోవాలి.


సాల్మన్ చేపలు ఎక్కువగా తీనడం వల్ల ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌తో యూటీఐ మంట తగ్గుతుంది. చేపలు ఇష్టం లేకపోతే క్రాన్బెర్రీస్, బ్లూ బెర్రీస్ తీసుకోవాలి. అటు ఆకు కూరలతో కూడా యూటీఐ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 


Also read: Diabetes Tips: రోజూ ఇలా చేస్తే టైప్ 2 డయాబెటిస్ నివారణ చాలా సులభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook