Disadvantages Of Using Phone In Toilet: మనలో చాలా మంది బాత్రూంలోకి ఫోన్‌ తీసుకెళ్తుంటారు. చాలా మంది ఈ విధంగా సమయాన్ని గడుపుతుంటారు. కానీ, ఇది ఆరోగ్యం పరంగా చాలా సమస్యలకు దారితీస్తుంది. దీని వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా చేయడం వల్ల మనం మరింత ముఖ్యమైన పనులకు కేటాయించాల్సిన సమయాన్ని వృథా చేస్తున్నాము. మొబైల్ స్క్రీన్‌ను దగ్గరగా చూడడం వల్ల కళ్ళకు అలసట, కళ్ళు ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. టాయిలెట్ సీట్‌పై కూర్చుని మొబైల్ వాడటం వల్ల మూలవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వాడటం వల్ల మనస్సు ఎల్లప్పుడూ అలసిపోతుంది. ఇది మనోవేదనకు దారితీస్తుంది. ఇలా చేయడం వల్ల మనం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపాల్సిన సమయాన్ని తగ్గించుకుంటాము. ఇది మన సామాజిక సంబంధాలను దెబ్బతీస్తుంది.


మొబైల్‌ను ఎంత సేపు వాడవచ్చు: 


సాధారణంగా, బాత్రూంలో మొబైల్‌ను వాడడం మంచిది కాదు. కానీ కొన్ని సార్లు ఫోన్‌ ఉపయోగించే అవసరం ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముందుగా బాత్రూంలో తేమ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల మొబైల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తేమ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఫోన్‌ ఉపయోగించాలి.  స్నానం చేస్తున్నప్పుడు మొబైల్‌ను వాడటం వల్ల  జారిపడే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో మార్కెట్‌లో లభించే బాత్రూం ఫోన్ హోల్డర్ ను ఉపయోగిచడం చాలా మంచిది.  తేమ వల్ల మొబైల్ బ్యాటరీ పాడవడానికి అవకాశం ఉంటుంది. ఫోన్‌ ఆ సమయంలో ఉపయోగించకుండా ఉంటే మంచిది. 


ఫోన్‌కు బదులుగా ఏ వస్తువులు ఉపయోగించాలి:


ఫోన్‌కు బదులుగా న్యూస్‌ పేపర్‌, పుస్తకాలు చదువుతే చాలా మంచిది. దీని వల్ల ఫోన్‌ నుంచి విశ్రాంతి కలుగుతుంది. 


బాత్రూంలో ఫోన్‌ ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యనష్టాలు:


ఎక్కువ సేపు బాత్రూంలో ఫోన్‌ ఉపయోగించడం వల్ల పైల్స్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మల విసర్జణ చేసే చోట వాపు రావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా మల విసర్జణ ప్రాంతంలో ఒత్తిడి కలుగుతుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. బాత్రూరంలో అరగంట లేదా నలభై ఐదు నిమిషాలు గడపటం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల  కలరా, టైఫాయిడ్‌, హెపటైటిస్‌ వంటి వ్యాధులు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్‌లో కేవలం ఏడు లేదా పది గంటల పాటు సమయం గడపాలి. ముఖ్యంగా, ఈ అలవాటును మనం మార్చుకోవడం చాలా ముఖ్యం. ఇది మన ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా,  మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.


Also Read: Liver Health: నాన్ ఆల్కహాల్‌ వారికి లీవర్‌ ఎందుకు దెబ్బతింటుంది? కారణాలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter