Viral Fever In Kids: ఇప్పడు  భారత్‌లో వానా కాలం మొదలైంది. అధిక వర్షాల కారణంగా వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. దీని కారణంగా చాలా మంది పిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో వైరల్‌ ఫివర్లు(Viral Fever)రావడం పెద్ద సమస్యగా మారింది. అయితే జ్వరం బారిన పడితే.. పిల్లలకు 2 నుంచి 3 రోజుల పాటు తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో డాక్టర్లను సంప్రదించడం చాలా మేలు లేకపోతే పిల్లలకు ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కావున ఈ సందర్భంగా వారిపై ప్రత్యేకమైన జాగ్రత్త వహించడం చాలా మంచిది. ముఖ్యంగా పిల్లల్లో ఇలాంటి సమస్యలకు గురైనప్పుడు వారికి మంచి పోషకాలున్న ఆహారాలను అందించడం చాలా మంచిది. ఇలా చేస్తే  చాలా త్వరగా కోలుకునే అవకాశాలున్నాయి. అయితే పిల్లల ఇలాంటి సమస్యల బారిన పడకుండా పలు రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి:


>>ఉదయాన్నే పిల్లలకు మంచి పోషకాలున్న టిఫిన్‌ తినిపించాలి. టీ సమయంలో బాదం పిండితో చేసిన బిస్కెట్లు లేదా టోస్ట్ ఇవ్వండి.
>>బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్‌కు బదులుగా.. ఓట్స్, పాలు, గంజి ఆహారంగా ఇవ్వాలి.
>>ఉదయం టిఫిన్‌ తర్వాత పండ్లు తినిపించాలి. ఈ పండ్లలో కచ్చితంగా అరటి, నారింజ, కివీ, ఆపిల్, బొప్పాయి, పెయిర్ వంటి పండ్లు ఇస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
>>మధ్యాహ్న భోజనంలో తప్పకుండా పప్పు, రోటీ, కూరగాయలను ఆహారంగా ఇవ్వాలి. జ్వరం వచ్చినప్పుడు పెరుగు రైతా లేదా చల్లని సలాడ్ తినిపించవద్దని నిపుణులు తెలుపుతున్నారు.
>>ఫీవర్‌ సమయంలో పిల్లలను భోజనం తర్వాత ఖచ్చితంగా నిద్రపోనివ్వండి.
>>సాయంత్రంగోరువెచ్చని పాలు ఇవ్వండి. అంతేకాకుండా ఆ పాలలో చిటికెడు పసుపు వేసి తాగించండి.
>>పిల్లలకు రాత్రి భోజనంలో రోటీ, కూరగాయలతో తాజా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినిపించండి.
>> తీవ్ర జ్వరంతో పిల్లలు ఉంటే..  కొబ్బరి నీరు, పాలు, తాజా రసం ఇవ్వవచ్చు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.


Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం


Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook