Vitamin B12: విటమిన్ బి12 కేవలం చేపలు, మాంసంలోనే కాదు..ఈ పదార్ధాల్లో కూడా పుష్కలం
Vitamin B12: విటమిన్ బి12 అనేది శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్. డైట్ ద్వారా ఈ విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు. విటమిన్ బి12 అనేది కేవలం నాన్ వెజ్ ఆహారంలో ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. ఇది ఎంతవరకూ నిజం..
శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్..బి12. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. కేవలం నాన్ వెజిటేరియన్ ఆహారంలోనే విటమిన్ బి12 ఉంటుందనేది ఎక్కువమంది అభిప్రాయం. అయితే శాకాహారంలో కూడా విటమిన్ బి12 లభ్యమౌతుంది.
విటమిన్ బి 12 అనేది శరీరానికి చాలా అవసరం. మెదడు, గుండె రెండింటికీ ఇది మంచిది. విటమిన్ బి 12 తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలకు చాలా అవసరం. విటమిన్ బి12 లోపిస్తే..పలు వ్యాధుల ముప్పు వెంటాడుతుంది. విటమిన్ బి12 లోపంతో రక్త, మెదడు పనితీరు రెండూ బలహీనమౌతాయి. రోజుకు 2.4 నుంచి 2.6 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలతోనే విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు.
పాలు, పాల ఉత్పత్తులు
పాలు, పెరుగుతో తయారయ్యా పదార్ధాల్లో విటమిన్ బి12 పెద్దఎత్తున ఉంటుంది. పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తుల్ని డైట్‌లో భాగంగా చేసుకుంటే..విటమిన్ బి12 లోపాన్ని దూరం చేయవచ్చు. ఇవి ప్రోటీన్లు, కాల్షియంలతో నిండి ఉంటాయి. ఆరోగ్యానికి ప్రయోజనం కల్గిస్తాయి.
సాల్మన్, ట్యూనా
ట్యూనా, సాల్మన్ చేపల్లో విటమిన్ బి12 పెద్దమొత్తంలో ఉంటుంది. ఇందులో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది దీంతోపాటు విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మాంసాహారం విటమిన్ బి12కు కీలక ప్రత్యామ్నాయం.
ఓట్స్
చాలామంది బరువు తగ్గించేందుకు ఓట్స్ తింటుంటారు. కానీ ఇందులో ఇతర చాలా పోషకాలుంటాయి. ఓట్స్‌లో విటమిన్ బి12 పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఆరోగ్యానికి లాభం చేకూరుస్తుంది.
కూరగాయలు
కొన్ని కూరగాయల్లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. బ్రోకలీలో విటమిన్ బి12 ఎక్కువగా లభిస్తుంది. ఇందులో విటమిన్ బి9 కూడా ఉంటుంది. ఇది కాకుండా మష్రూమ్ కూడా విటమిన్ బి12కు మంచి సోర్స్.
సోయాబీన్
సోయాబీన్స్‌లో పోషకాలు చాలా ఎక్కువ. సోయాబీన్స్‌తో తయారయ్యే పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకుంటే విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు. సోయా చంక్స్, సోయా మిల్క్, సోయాబీన్ స్ప్రౌట్స్ రూపంలో తీసుకోవచ్చు.
గుడ్లు
గుడ్లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. చాలామంది గుడ్లు తినడాన్ని ఇష్టపడరు. కానీ విటమిన్ బి12 పుష్కలంగా ఉండటంతో రోజూ క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితాలుంటాయి.
Also read: Nail Biting: గోర్లు కొరికే అలవాటుందా..ఈ ప్రమాదకర వ్యాధులు రావచ్చు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook