Vitamin B9 Deficiency: విటమిన్ బి9 గురించి విన్నారా..ఈ విటమిన్ లోపంతో కన్పించే లక్షణాలివే
Vitamin B9 Deficiency: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ల పాత్ర కీలకం. ఒక్కొక్క విటమిన్ లోపానికి ఒక్కో సమస్య తలెత్తుతుంది. ఇందులో ముఖ్యమైంది విటమిన్ బి9. ఆ వివరాలు మీ కోసం..
సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్లు, మినరల్స్ వంటి పోషక పదార్ధాలు శరీరానికి చాలా అవసరం. విటమిన్లు చాలారకాలుగా ఉంటాయి. ఇందులో ఏది తక్కువైనా..ఏదో ఒక సమస్య బయటపడుతుంటుంది. మరి విటమిన్ బి9 గురించి ఎప్పుడైనా విన్నారా..
శరీర నిర్మాణంలో, సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో రకాల విటమిన్లలో ఒకటి విటమిన్ బి9. విటమిన్ బి9 అనేది శరీరంలో డ్యామేజ్ అయిన సెల్స్‌ను మరమ్మత్తు చేస్తుంది. విటమిన్ బి9 లోపముంటే ఏ విధమైన సమస్యలు ఎదురౌతాయో చూద్దాం. విటమిన్ బి9 అంటే ఫోలిక్ యాసిడ్. మగవారిలో ఫెర్టిలిటీని పెంచడం, ఒత్తిడిని తగ్గించడం, కేన్సర్ వంటి వ్యాధుల్ని నిర్మూలించడంలో విటమిన్ బి9 దోహదపడుతుంది. విటమిన్ బి9 లోపముంటే..శరీరంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. విటమిన్ బి9 లోపముంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
విటమిన్ బి9 లోపంతో కన్పించే లక్షణాలు
రక్తహీనత
విటమిన్ బి లోపముంటే కన్పించే తొలి లక్షణం శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పాటులో ఫోలిక్ యాసిడ్ అత్యంత కీలకం. శరీరంలో విటమిన్ బి9 లోపముంటే రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్య తగ్గుతుంది. అందుకే శరీరంలో రక్తహీనత ఉంటే..నిర్లక్ష్యం చేయకూడదు.
బలహీనత
తరచూ ఆలసటగా ఉంటే విటమిన్ బి9 లోపం కావచ్చు. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్య తగ్గితే..శరీరంలో అన్నిభాగాలకు ఆక్సిజన్ అందదు. ఫలితంగా తీవ్రమైన అలసట ఉంటుంది. అంతేకాదు..విటమిన్ బి9 లోపంతో చర్మం రంగు పసుపుగా మారుతుంది.
జుట్టు తెల్లబడటం
విటమిన్ బి9 లోపం కారణంగా జుట్టు తెల్లబడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. తక్కువ వయస్సులోనే కేశాలు తెల్లబడితే శరీరంలో విటమిన్ బి9 లోపంగా గుర్తించవచ్చు. అందుకే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
విటమిన్ బి9 లోపాన్ని ఎలా పూర్తి చేయాలి
విటమిన్ బి9 లోపాన్ని సరిచేసేందుకు డైట్‌లో ప్రతిరోజూ లేదా వారానికి 3-4 సార్లు రాజ్మా, ఎగ్, బాదాం, సోయాబీన్స్ ఉండేట్టు చూసుకోవాలి.
Also read: Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ రోజూ తింటే..లివర్, లంగ్స్ సమస్యలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook