Winter Tips For Weight Loss: సీజన్ మారుతున్న కొద్ది మార్కెట్లో వివిధ రకాల పండ్లు ఆహార పదార్థాలు దర్శనం ఇస్తాయి. ముఖ్యంగా చలికాలంలో పండ్ల విక్రయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఇక పచ్చల్లో విషయానికి వస్తే.. ఉసిరికాయ, టమాటా వంటి చాలా రకాలుగా పచ్చలము ఇదే క్రమంలో తయారు చేసి నిలువ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉసిరి విషయానికొస్తే ఈ పచ్చడిని తినేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి చిన్న జాతికి చెందిన కాయ అయితే.. రెండవది పెద్ద జాతికి చెందిన కాయ.
ఉసిరి ఎక్కువగా చలికాలంలో లభిస్తూ ఉంటాయి. కాబట్టి చలికాలంలో వీటితో చేసిన పచ్చడిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే వీటి నుంచి తీసిన రసాన్ని కూడా నిల్వ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని రసంలో అధిక పరిమాణంలో ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. అయితే ఈ జ్యూస్ ను తయారు చేయడానికి మార్కెట్లో లభించే పెద్ద ఉసిరికాయలను వినియోగిస్తారు.
ఈ రసం ఎక్కువగా పొగరుగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ చిట్కాను పాటిస్తే ఉసిరి నుంచి కలిగే ప్రయోజనాలు మీరు పొందవచ్చు. అయితే ఉసిరి రసం నేరుగా తీసుకోకుండా వాటి గింజలను వేరుచేసి ఉసిరి తొక్కలను ఎండలో ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన తర్వాత ఓ సీసాలో గాని ఒక డబ్బాలో కానీ నిల్వ చేసుకోవాలి. సీజనల్ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా భద్రపరచుకున్న వాటిని పొడిలా చేసుకుని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ముఖ్యంగా సీజనల్ వ్యాధుల కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు ఉసిరి పొడిని ప్రతిరోజు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగాలని సూచిస్తున్నారు. దగ్గు జలుబు రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ ఉసిరి పొడిని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా మధుమేహం, బరువు తగ్గాలనుకునే వారికి ఉసిరి పొడి ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఉసిరి పొడిని వినియోగించవచ్చు.
Also Read : నా చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది.. కృష్ణ మృతిపై స్టార్ కామెంటేటర్ సంతాపం!
Also Read : Krishna Demise: తెలుగు సినిమాకు సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు చేసిన చేసిన కృష్ణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook