Walnuts on empty stomach: డ్రైఫ్రూట్స్‌ తింటే మన శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, వాల్‌నట్స్‌ తింటే కూడా మనకు ఎంతో హెల్తీ ఇందులో ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్ రాత్రి నానబెట్టుకుని ఉదయం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అవేంటో తెలుసుకుందాం. వాల్‌నట్స్‌ ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్‌ వ్యాధులు మీ దరిచేరకుండా ఉంటాయి. అంతేకాదు వాల్‌నట్స్‌ తీసుకోవడం వల్ల మీ శరీరానికి బలం కూడా. సాధారణంగా డ్రైఫ్రూట్స్‌ కొన్ని ఒక్కోటి ఒక్కో సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. మరి వాల్‌నట్స్‌  ఏ సమయంలో తినాలి? వాల్‌నట్స్‌ ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల దీన్ని ప్రయోజనాలు రెట్టింపు ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్‌నట్స్‌లో సాధారణంగా మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మన డైట్లో చేర్చుకోవడం తప్పనిసరి ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు వాల్‌నట్స్‌ డైట్లో తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వదు. ఇక ఉదయం ఖాళీ కడుపున తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయెజనాలు పొందుతారు.


సరైన నిద్ర..
నిద్ర లేమి సమస్యతో బాధపడేవారు వాల్‌నట్స్‌ డైట్లో చేర్చుకోండి. దీంతో మంచి నిద్ర వస్తుంది. సాధారణంగా నిద్ర లేమితో బాధపడేవారిలో డిప్రెషన్‌కు దారితీస్తుంది. అందుకే ప్రతిరోజూ ఖాళీ కడుపున వాల్‌నట్స్‌ తీసుకోవడం ప్రారంభిస్తే ఈ సమస్య దరిచేరదు.


ఇదీ చదవండి:మగవారిలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఈ 5 లక్షణాలు కనిపిస్తాయట..


మలబద్ధకం..
వాల్‌నట్స్ లో ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యకు చెక్‌ పెడుతుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది ఎఫెక్టివ్‌ రెమిడీగా పనిచేస్తుంది.


పోషకాలు..
వాల్‌నట్స్‌ ఉదయం ఖాళీ కడపున తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో పుష్కల పోషకాలు ఉంటాయి. వాల్‌నట్స్ లో విటమిన్స్‌, ఖనిజాలు ఉంటాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి కచ్చితంగా తీసుకోవాలి.


ఇదీ చదవండి: కాఫీకి బదులుగా ఈ 5 డ్రింక్స్ తీసుకోండి.. డబుల్‌ హెల్త్‌ బెనిఫిట్స్..


వాల్‌నట్స్ ఉదయం ఖాళీ కడపుతో తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. 
 స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాల్‌నట్స్‌ తినడం వల్ల లాభాలు ఉంటాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter