High Cholesterol Symptoms in Men: అధిక కొలెస్ట్రాల్‌తో ఈకాలంలో చాలామంది బాధపడుతున్నారు. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అయితే, మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ముఖ్యంగా మగవారిలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొన్ని లక్షణాలు వారిలో కనిపిస్తాయట. కొలెస్ట్రాల్ అనేది మన రక్త ధమనుల్లో అడ్డుగా ఫలకాలు ఏర్పడటం. దీంతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. తద్వారా కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సమస్యలు వస్తాయి. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. HDL మంచి కొలెస్ట్రాల్, ఇవి మన శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వులను ధమనుల ద్వారా కాలేయానికి చేర్చి తద్వారా బయటకు పంపుతాయి. LDL చెడు కొలెస్ట్రాల్ దీంతో మన శరీరంలో చెడె కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.అయితే, పెరిగిన కొలెస్ట్రాల్ లక్షణాలు ఆడ, మగవారిలో వేర్వేరుగా కనిపిస్తాయట. కొన్ని లక్షణాల ద్వారా మగవారిలో కొలెస్ట్రాల్ పెరిగినట్లు గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
గ్జాంథెలాస్మ..
ఇది కంటి వద్ద కనిపించే లక్షణం. మగవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయని సూచిస్తాయి. కంటి వద్ద పచ్చరంగులో కనిపిస్తుంది. ఇది ముక్కు వద్ద కూడా కొంతమందిలో కనిపించవచ్చు.
ఛాతినొప్పి..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే అథెరోక్లోరోసిస్ కు దారితీస్తుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. రక్త సరఫరా గుండెకు అడ్డుగా ఫలకాలు అడ్డుపడినప్పుడు ఇలా ఛాతినొప్పి, ఎంజినాకు దారితీస్తుంది. ఈ లక్షణం ఒక్కోసారి అతిగా స్ట్రెస్‌కు గురైనప్పుడు కూడా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: ఈ 10 ఫుడ్స్‌తో మీకు హార్ట్ బ్లాక్ సమస్యే ఉండదు.. గుండె పదికాలలపాటు పదిలం..
మొద్దుబారడం..
మగవారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు రక్త సరఫరాకు కూడా తగ్గిపోతుంది. దీంతో కాళ్లు మొద్దుబారినట్టు అనిపిస్తుంది. అంతేకాదు కాళ్లలో బలహీనతగా అనిపించడం కూడా జరుగుతుంది.
శ్వాస సంబంధిత సమస్య..
హై కొలెస్ట్రాల్‌తో బాధపడే మగవారిలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఇది కరోనరీ అర్టెరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్‌కు కూడా దారితీస్తుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో కూడా ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా పడుకున్నప్పుడు, ఏదైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఈ లక్షణం మగవారిలో గుర్తించవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: మీరు చేసే ఈ 5 పొరపాట్లే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter