Watermelon Risks: వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటి పరిమాణం చాలా ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. పుచ్చకాయలో తగినన్నీ పోషకాలతో పాటు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వేసవిలో ప్రతి ఒక్కరూ పుచ్చకాయ తప్పనిసరిగా తింటే మంచిది. కానీ, కొందరు మాత్రం పుచ్చకాయ తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.  
ఏఏ అనారోగ్యాలు ఉన్న వాళ్లు పుచ్చకాయ తినకూడదు?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. గుండె రోగులు


పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకం శరీరంలో పెరిగితే గుండె వేగంగా కొట్టుకోవడం, బలహీనమైన పల్స్ రేటు వంటి సమస్యలు ఉండవచ్చు.


2. జలుబు, దగ్గు


జలుపు, దగ్గు సమస్య ఉన్న వాళ్లు పుచ్చకాయ తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పండు చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కాయ తినడం వల్ల జలుబు, దగ్గు ప్రభావం పెరిగే అవకాశం ఉంది. 


3. మధుమేహ రోగులు


పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. దీన్ని అధికంగా తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినకపోడమే మంచిది. 


4. ఆర్థరైటిస్ రోగులు


ఆర్థరైటిస్ ఉన్న రోగులు పుచ్చకాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారి శరీరంలో వాపు లేదా నొప్పితో సమస్యలు ఉండవచ్చు.


(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికల ఆధారంగా సేకరించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 


ALso Read: Dangerous Fruit Combinations: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటే ఇక అంతే సంగతులు!


Also Read: Detox Drinks Benefits: శరీరంలో వ్యర్థాలను, మలినాలను తొలగించుకునేందుకు ఈ డ్రింక్స్ తాగండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.