Weight Loss Diet: పసుపులో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలున్నాయి.  దీనిని అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగించవచ్చు. పూర్వీకులు విష జ్వరాలకు పసుపు నీటినే వినియోగించేవారు. ఇందులో ఉండే మూలకాలు ఫీవర్‌ను తగ్గించి దగ్గు జలుబును సులభంగా నియంత్రిస్తాయి. అయితే  ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే వాటి నుంచి ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. బరువు తగ్గడానికి ఆయుర్వేద నిపుణులు సూచించి పసుపు నీటిని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో పసుపు నీటిని తీసుకుంటే సులభంగా బరువుకు చెక్‌ పెట్టొచని ఆరోగ్య నిపుణులు తెలుపులున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు జీవక్రియను పెంచుతుంది:
పసుపులో పాలీఫెనాల్స్, కర్కుమిన్ సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ క్రియ సమస్యలు తగ్గి బరువు కూడా సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది.


పసుపును నీటిని ఎలా తాగాలి:
1. ముందుగా నీటివి వేడా చేయాలి అందులో ఒక చెంచా పసుపును వేసి మరిగించాలి.
2. ఇలా మరిగిన నీటిని ఫిల్టర్ చేయాలి.
3. పసుపు ఫిల్టర్ చేసిన నీటిలో కొంచెం తేనె కలపండి.
4. పసుపును నీటిని తయారు చేసే ముందు తప్పకుండా పసుపును ముద్దలు చేసి మరిగించాలి.
5. రోజూ ఖాళీ కడుపుతో పసుపు నీరు త్రాగాలి.  


పసుపు వల్ల ప్రయోజనాలు:
పసుపు నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
పసుపు పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి.


మధుమేహం:
మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారికి కూడా పసుపు నీరు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..   


Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook