COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weight Loss Roti Diet: ఓట్స్ అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్ పరిమాణాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇందులో ఉండే గుణాలు అధిక రక్తపోటు, షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. అయితే చాలా మందికి ఓట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. దీని కారణంగా కొంతమంది రోజు తినడానికి ఇష్టపడడం లేదు. నిజానికి ఓట్స్‌ను పిండిగా పట్టించుకోని రోటీలు తయారు చేసుకొని కూడా తినొచ్చు. అయితే ఈ రోటీలను ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఓట్స్ రోటీ రెసిపీ:
కావలసిన పదార్థాలు:
✽ 1 కప్పు రోల్డ్ ఓట్స్
✽ 1/2 కప్పు గోధుమ పిండి
✽ 1/4 టీస్పూన్ ఉప్పు
✽ 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
✽ 1/4 టీస్పూన్ ధనియాల పొడి
✽ 1/4 కప్పు నీరు
✽ నూనె, వేయించడానికి


తయారీ విధానం:
ముందుగా ఓట్స్ను తీసుకొని పిండిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
✽ ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఓట్స్ పిండి తగినంత గోధుమపిండి వేసి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 
✽ ఇదే పిండిలో తగినంత ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి, మరోసారి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
✽ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దికొద్దిగా నీటిని పోస్తూ పిండిని మృదువుగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
✽ ఇలా కలుపుకున్న పిండిని 20 నిమిషాల పాటు పక్కనపెట్టి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని, రోటీలుగా ఒత్తుకోవాల్సి ఉంటుంది.
✽ ఇలా ఒత్తుకున్న రోటీలను పెనంపై గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
✽ ఒకవైపు కాలిన తర్వాత కావాలనుకుంటే బటర్ లేదా నూనెను వేసుకొని మరోవైపు కాల్చుకోవాలి.
✽ ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వేడివేడిగా పప్పులోకి సర్వ్ చేసుకుని తింటే భలే ఉంటుంది.


చిట్కాలు:
✽ ఈ ఓట్స్ రోటీలు మరింత రుచిగా తయారు చేసుకోవడానికి పిండిలో కూరగాయలను మిక్సీ పట్టుకొని మిశ్రమం కూడా వినియోగించవచ్చు.
✽ రోటీలు మెత్తగా ఉండడానికి హాట్ బాక్స్ లో పెట్టుకోవడం చాలా మంచిది.
✽ ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీలను కాల్చుకునే క్రమంలో నూనెను వినియోగించకపోవడం చాలా మంచిది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి