Weight Loss Drink: ఈ 3 టీలతో బరువు తగ్గడమే కాదు..శరీరంలోని కొలెస్ట్రాల్ను కూడా 7 రోజుల్లో కరిగించుకోవచ్చు!
Weight Loss Drink: బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతిరోజు వాకింగ్ చేయడమే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని టీలను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను ఉపశమనం కలిగిస్తాయి.
Weight Loss Drink: ప్రస్తుతం బరువు పెరగడం కారణంగా చాలామంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీర బరువు నియంత్రించుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ప్రస్తుతం విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల బరువుతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.
అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని టీలను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన మసాలా టీలను ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
అల్లం టీ:
అల్లం టీ నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర బరువును తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఈ టీ లో ఉండే గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి.. కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తాయి. కాబట్టి ప్రతిరోజు అల్లం టీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ టీ ప్రతిరోజు తాగితే శరీరం కూడా యాక్టివ్ గా మారుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం
దాల్చిన చెక్క టీ:
దాల్చిన చెక్క టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. దీంతోపాటు శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరిగించి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
జీలకర్ర టీ:
జీలకర్ర టీలో లభించే లభించే ఆయుర్వేద గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు జీలకర్రతో తయారుచేసిన నీటిని తాగడం మంచిది. జీలకర్ర టీ లో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజుకు రెండుసార్లు ఈ టీని తాగడం చాలా మంచిది. ఈ జీలకర్ర టీలో తేనెను కలుపుకొని తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.