Weight Loss Drink: చాలా మంది శరీరంపై దృష్టి పెట్టకపోవడం వల్ల విపరీతంగా శరీర బరువు పెరుగుతున్నారు.శరీర బరువు పెరగడానికి ప్రధాన కారణాలు గంటల తరబడి ఒకే చోట కూర్చొవడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీర బరువును తగ్గించడానికి తప్పకుండా జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వేసవి కాలంలో కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ప్రతి రోజూ పలు డ్రింక్స్‌ తాగాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊబకాయం వల్ల వచ్చే వ్యాధులు!
ఊబకాయం వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు, సంతానోత్పత్తి, గుండె, ఆస్టియో ఆర్థరైటిస్, టైప్ 2 మధుమేహం వంటి సమస్యలు రావొచ్చు. అధిక బరువు ఉన్న పురుషుల్లో కొలొరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరిగే అవకాశాలున్నాయి. శరీర బరువు నియంత్రణలో లేకపోవడం శరీర జీవక్రియ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మజ్జిగ, నిమ్మకాయ నీటిని తాగాల్సి ఉంటుంది.


పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది:
1. మజ్జిగతో శరీర బరువును తగ్గించుకోవచ్చు:

మజ్జిగ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడానికి, బరువు నియంత్రించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. వేసవిలో పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి మజ్జిగ దివ్యౌషధంలా పని చేస్తుంది. ఎందుకంటే మజ్జిగలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుంది.


2. తులసి గింజలు:
తులసి గింజలను నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోనాలు కలుగుతాయి. దీంతో పాలు సులభంగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. తులసి గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని నీటిలో కలిపి తీసుకుంటే సులభంగా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


3. నిమ్మకాయ కలిపి గోరువెచ్చని నీరు:
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఒక నెల పాటు తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలో ఉండే టాక్సిన్స్ త్వరగా బయటకు వస్తాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు


ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook