చాలామంది ప్రస్తుత జీవన విధానంలో అధిక బరువుతో సతమతమవుతున్నారు. బరువు తగ్గించే క్రమంలో విభిన్న రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వ్యాయామాం, డైటింగ్, చిట్కా వైద్యాలు ఇలా చాలా పద్ధతులు అవలంభిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇలాంటివి ఏవీ లేకుండా బరువు తగ్గుతుంటే..ఆనందించవద్దు. అప్రమత్తం కావల్సిన అవసరముంది. ఏదైనా సీరియస్ వ్యాధికి సంకేతం కావచ్చు. అందుకే బరువు తగ్గుతున్నప్పుడు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. హఠాత్తుగా బరువు తగ్గేందుకు కారణాలేంటో తెలుసుకుందాం..


హఠాత్తుగా బరువు తగ్గడం వెనుక కారణాలు


డయాబెటిస్


డయాబెటిస్ సమస్య ఉన్నప్పుడు హఠాత్తుగా బరువు తగ్గుతుంటారు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అవసరానికంటే ఎక్కువైతే ఆ ప్రభావం బరువుపై పడుతుంది. ఈ క్రమంలో ముందు వ్యక్తి బరువు పెరిగి..స్థూలకాయం ఏర్పడుతుంది. తరువాత ఓ దశ దాటిన తరువాత బరువు హఠాత్తుగా తగ్గడం ప్రారంభమౌతుంది. ఫలితంగా బలహీనమైపోతారు. సన్నగా మారిపోతారు.


కేన్సర్


ఇటీవల కేన్సర్ వ్యాధి కేసులు కూడా అధికంగా ఉంటున్నాయి. కేన్సర్ అనేది చికిత్స లేని వ్యాధి కాదు. కానీ సమయానికి లక్షణాల్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ లక్షణాల్లో ఒకటి బరువు తగ్గడం, ఎవరైనా వ్యక్తికి కేన్సర్ ఉంటే..ఆ వ్యక్తి బరువు వేగంగా తగ్గడం ప్రారంభమౌతుంది. ఎందుకంటే శరీరంలో కేన్సర్ ఉన్నప్పుడు మనలోని పోషక పదార్ధాలు ఆ కేన్సర్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటంలో ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గిపోతారు.


Also read: Health Benefits: పాలలో ఆ పౌడర్ కలిపి తాగితే..21 రోజుల్లో ఆ సమస్యలకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook