Weight Loss Tips: బాదంతో బరువు తగ్గడం సులభం గురూ..
Weight Loss With Almonds: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు బాదం పప్పులను తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Weight Loss With Almonds: అనారోగ్యకరమైన ఆహారాలు తరుచుగా తినడం వల్ల చాలా మంది ఊబకాయం సమస్యల బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది వేగంగా బరువు పెరిగిపోతున్నారు. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. స్థూలకాయం సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం వహించకూడదు..దీనిని నెగ్లెక్ట్ చేయడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది దీని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను గమనించి, వ్యాయామాలు, డైట్ పద్దతులను అనుసరిస్తున్నారు. ఇలా విశ్వప్రయత్నాలు చేసిన బరువు తగ్గలేకపోతున్నారు.
అయితే జిమ్‌కి వెళ్లడానికి సమయం లేని వారు ఎలాంటి కష్టం లేకుండా కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఇటీవలే ఒబేసిటీ జర్నల్‌లో తెలింది. కొన్ని డైట్లు పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని ఆ జర్నల్స్‌లో వెల్లడైంది. జర్నల్స్ పేర్కొన్న సమాచారం ప్రకారం.. ప్రతి రోజు బాదం పప్పును తినడం వల్ల సులభంగా బరువు తగ్గడమేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా నియత్రించుకోవచ్చు. అయితే ఈ బాదం పప్పుతో ఎలా బరువు తగ్గాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పరిశోధకులు ఏం చెబుతున్నాయంటే?
యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బాదంలో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రతి రోజు బాదంపప్పు తిన్న కొందరిలో 7 కిలోల వరకు బరువు తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బాదం పప్పు శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది:
బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రొటీన్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు బాదంపప్పు తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరం చురుగ్గా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు హిమోగ్లోబిన్ లోపాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
బాదంపప్పును ఇలా తినండి:
సలభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బాదం పప్పును సరైన పద్ధతిలో తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..5 నుంచి 10 సంవత్సరాల ఉన్న పిల్లలు ప్రతిరోజూ 2 నుంచి 4 బాదంపప్పులను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక యువకులు రోజూ 6 నుంచి 8 బాదంపప్పులను తినొచ్చు. మహిళలు రోజూ 12 బాదంపప్పులు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి