Weight Loss Tips: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది స్థూల కాయంతో బాధపడుతున్నారు. అధిక బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చాలా మంది జిమ్ ల బాట పడుతుంటారు. కానీ, ప్రస్తుతం చాలా మంది బిజీ పనుల నేపథ్యంలో కనీసం వ్యాయామం చేసేందుకు సమయం కూడా ఉండడం లేదు. అలాంటి వారు చింతించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గేందుకు మీకు కొన్ని చిట్కాలను చెబుతాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మరసం బరువు తగ్గిస్తుంది


ప్రతి ఇంట్లోని వంటగదిలో కచ్చితంగా నిమ్మకాయ ఉంటుంది. బరువు తగ్గేందుకు చాలా మంది నిమ్మరసం తాగుతుంటారు. ఎందుకంటే నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. నిజానికి నిమ్మకాయలో కేలరీలు చాలా తక్కువ. కాబట్టి దాని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మరసం వల్ల జీవక్రియను కూడా మెరుగవుతుంది.


బరువు తగ్గడానికి దాల్చిన చెక్క 


మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చినచెక్కను తింటుంటారు. దాల్చిన చెక్క షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.


ఆపిల్ సైడర్ వెనిగర్


ఆపిల్ వెనిగర్ ఉపయోగం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరం నుంచి కొవ్వు మొత్తాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు.


పచ్చి ఏలకులు..


ఏలకులు బరువు తగ్గేందుకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. బరువు తగ్గించడంతో పాటు, పచ్చి ఏలకులు పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా ప్రభావవంతమైన పని చేస్తుంది.


బరువు తగ్గడానికి జామకాయ 


జామకాయ త్వరగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జామకాయ వినియోగం శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.


(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)    


Also Read: White Hair Solution: తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి!


ALso Read: Chikoo Health Benefits: ఈ అనారోగ్య సమస్యలకు సపోటా పండు ఎంతో మేలు చేస్తుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook