Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు ఇలా ఆహారాన్ని తీసుకుంటే.. కేవలం 10 రోజుల్లో బరువు తగ్గుతారు..!
Best Time To Eat Food Due To Weight Loss: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బరువు పెరగడం వంటి శరీర సమస్యలతో బాధపడడం విశేషం. కరోనా సందర్భంలో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేయడం కారణంగా ఒకే చోట కూర్చొని ఊహించని రీతిలో బరువు పెరిగారు.
Best Time To Eat Food Due To Weight Loss: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బరువు పెరగడం వంటి శరీర సమస్యలతో బాధపడడం విశేషం. కరోనా సందర్భంలో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేయడం కారణంగా ఒకే చోట కూర్చొని ఊహించని రీతిలో బరువు పెరిగారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌లను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. బరువు తగ్గే క్రమంలో తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా రోజూ పాటించడం వల్ల సులభంగా బరువ తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసే క్రమంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే ఏ సందర్భంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గే క్రమంలో భోజనం చేసే సమయంలో నిపుణుల సలహా చాలా అవసరం:
డైట్‌లో భాగంగా మూడుసార్లు టేమింగ్‌ని ఫిక్స్ చేసి.. ప్రతిరోజూ దానిని అనుసరించాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అప్పుడే మన శరీర ఆకృతిలో తేడాలు, మార్పులు వస్తాయి.
ఇది నిజమే..:
భోజనం తర్వాత శరీరం ఎంత సేపు యాక్టివ్‌గా ఉంటుంద.. కేలరీలు అంత ఎక్కువ కాలం పాటు కరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా జరగకపోతే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి తిన్న తర్వాత వెంటనే నిద్రపోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రపోయే ఈ సమయంలో మాత్రమే రాత్రి భోజనం చేయాలి:
నిద్రపోయే ముందు మన శరీరం మెలటోనిన్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ జరగక ముందే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే బరువు సులభంగా తగ్గుతుంది.
ఇలా చేయడం చాలా ఉత్తం:
అనేక సర్వేల ప్రకారం.. బరువు తగ్గాలనుకునే వారు అల్పాహారం చేయడానికి సరైన సమయం ఉదయం 7:00 గంటలు, భోజనం చేయడానికి సరైన సమయం 12:30, ఇక రాత్రి పూట భోజనం 7:00 గంటలకు చేస్తే శరీరానికి మంచి ఫలితాలు లభించడమే కాకుండా బరువు సులభంగా తగ్గుతారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook