Vegetable Soups For Weight Loss: పచ్చి కూరగాయలతో తయారు చేసిన సూప్‌ను తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియ మెరుగుపరచడమేకాకుండా శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు పచ్చి కూరగాయలతో తయారు చేసిన సూప్‌లను తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబటి ఏయే కూరగాయలతో తయారు చేసిన సూప్‌లను తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీర బరువును తగ్గించుకోవడానికి ఈ సూప్‌లను తాగండి:
కాలీఫ్లవర్ సూప్:

కాలీఫ్లవర్ సూప్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావంతంగా సహాయపడుతుంది. కాబట్టి ఈ సూప్‌ను తయారు చేయడానికి ముందుగా నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ ముక్కలు వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో రెండు గ్లాసుల నీటిని వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత ఉప్పు వేసి పక్క పెట్టాలి. ఈ సూప్‌ చల్లారిన తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత


బీట్‌రూట్ సూప్:
ప్రతి రోజు బీట్‌రూట్‌తో తయారు చేసిన సూప్‌ను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు రక్తాన్ని శుద్ధి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సూప్‌ను తయారు చేయడానికి ముందుగా గ్యాస్‌ స్టవ్‌ వెలిగించాలి. ఆ తర్వాత ఓ బౌల్‌ పెట్టి అందులో తగినంత నూనెను వేసి ఉల్లిపాయ, టొమాటో, బీట్‌రూట్ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత అందులోనే రెండు కప్పుల నీటిని వేసి మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత ఉదయం అల్పాహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. 


సొరకాయ సూప్:
సొరకాయ సూప్ కూడా శరీరానికి చాలా మంచిది. ముఖ్యగా ఈ సూప్‌ను వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సూప్‌ను తయారు చేయడానికి ముందుగా బాణలిలో తగినంత నూనె వేసుకుని, ఉల్లిపాయలు, టమోటాలు ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొన్ని నీటిని వేసి బాగా మరిగించి తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న సూప్‌ చల్లారిన తర్వాత తీసుకోవాలి. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook