Hot Water: వేడి నీరు తాగుతున్నారా? ఈ సమస్యలు తలెత్తటం ఖాయం!
Side Effects Of Drinking Hot Water: మనలో కొంతమంది ఉదయం పూట వేడి నీటిని తాగుతుంటారు. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్ల లాభాలు ఉన్న సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
Side Effects Of Drinking Hot Water: సాధారణంగా మనిషి శరీరంలో 60 శాతంపైగా నీరు ఉంటుంది. ఇది తగ్గిన ప్రతిసారి దాహం వేస్తుంది. అయితే కొందరు దాహం వేసినా నీరు తీసుకోవడానికి ఇష్టపడరు. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇటీవల జీర్ణక్రియ వ్యవస్థత, బరువు తగ్గడం వంటి సమస్యల నుంచి బయట పడడానికి కొంతమంది ఉదయం వేడి నీరు తాగుతున్నారు. పరగడుపున నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమయి కడుపు శుభ్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతీసారి వేడి నీరు తాగడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
సాధారణ నీటి కంటే వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. వేడి నీరు తాగడం వల్ల అన్నవాహిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిరోజు వేడి నీరు తాగడం వల్ల పేగుల్లో సమస్యలు వస్తాయి. వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజు వేడి నీరు తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
వేడి నీరు తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు:
చర్మ సమస్యలు:
ప్రతిరోజు వేడి నీరు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, దురద, చర్మం కాలడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చర్మం యొక్క సహజమైన నూనెలు తొలగిపోయి.
జుట్టు సమస్యలు:
వేడి నీరు తీసుకోవడం వల్ల జుట్టు పొడిబారడం, చిట్లడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రంగు మారడానికి కూడా వేడి నీరు ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు సమస్యలు:
వేడి నీటితో స్నానం చేయడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ప్రమాదకరమైనది.
జీర్ణ సమస్యలు:
చాలా వేడి నీరు తాగడం వల్ల జీర్ణ రసాల స్రావం దెబ్బతింటుంది. దీని వల్ల అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.
గర్భిణీ స్త్రీలకు ప్రమాదం:
గర్భిణీ స్త్రీలు చాలా వేడి నీరు తాగడం వల్ల గర్భస్రావం, పిండం దెబ్బతినడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి.
Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter