Omicron Variant Symptoms: డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల్లో తేడాలేంటి
Omicron Variant Symptoms: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచమంతా వణికిస్తోంది. ఇటు ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమైంది. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్, థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్. రెండింటికీ తేడా ఏంటనేది తెలుసుకుందాం..
Omicron Variant Symptoms: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచమంతా వణికిస్తోంది. ఇటు ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమైంది. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్, థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్. రెండింటికీ తేడా ఏంటనేది తెలుసుకుందాం..
కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం పెరుగుతోంది. రోజుకు 3 లక్షల చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా కన్పిస్తోంది. ఈ క్రమంలో డెల్టా వేరియంట్‌కు ఒమిక్రాన్‌కు తేడా ఏంటనేది తెలుసుకోవాలి. ప్రధానంగా దగ్గు స్వభావాన్ని బట్టి ఒమిక్రాన్ లేదా డెల్టా వేరియంట్‌ను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ సోకినవారు పొడి దగ్గుతోనూ..ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారు తడి దగ్గు అంటే కఫం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అధికశాతం కేసుల్ని పరిశీలించినప్పుడు ఈ తేడా స్పష్టమైంది.
ఇక ఇతర లక్షణాల్లో ఒమిక్రాన్ (Omicron Symptoms) సోకినవారిలో 101 డిగ్రీల కంటే తక్కువ జ్వరం ఉండటం, తీవ్రమైన తలనొప్పి, గొంతు గరగర ఉండటాన్ని వైద్యులు గమనించారు. కండ్ల కలక, వాసన కోల్పోవడం, నాడీ సంబంధిత లక్షణాలు డెల్టా వేరియంట్‌లో ఎక్కువగా కన్పించాయంటున్నారు వైద్యులు. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ లక్షణాల్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒమిక్రాన్ సోకినవారిలో నిర్దిష్టమైన లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు. డెల్టా వేరియంట్‌లో (Delta Variant) ఉన్నట్టు లక్షణాలు బయటపడటం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్టు ఉంటుంది. గొంతు నొప్పి, తలనొప్పి, ఛాతీ నొప్పి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారికి తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటాయి.
Also read: Acne Problem: ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.