Cause of White Hair Turn Black in 7 Days Naturally: ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సు గల వారే కాకుండా చాలా మంది చిన్న వయసుల్లో తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా జుట్టు రాలడం, బట్ట తల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెల్ల జుట్టు సమస్యలు చాలా మందిలో టెన్షన్ కారణంగా కూడా వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపుడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందిలో ఈ కింది కారణాల వల్ల కూడా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టు రంగు మారడానికి ఇదే కారణం:
ప్రతి ఒక్కరి శరీరంలో మెలనిన్ అనే  సహజ వర్ణద్రవ్యం ఉంటుంది. అయితే ఇందులో మార్పులు కారణంగా కూడా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందొచ్చు.


చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలు:
1. చాలా మందిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా తెల్ల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
2. విటమిన్ బి12 లోపం కారణంగా కూడా జుట్టు రాలడం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
3. రక్తహీనత కారణంగా తెల్ల జుట్టు సమస్యలతో పాటు, చర్మం రంగు మారడం వంటి సమస్యల కూడా ఉత్పన్నమవుతాయి.
4. చిన్న పిల్లల్లో కూడా తెల్ల జుట్టు రావడం మొదలవుతుంది. అయితే ఇది క్వాషియోర్కర్ వ్యాధి వల్ల వస్తున్నాయి.
5. హైపోథైరాయిడిజం సమస్యలతో బాధపడేవారికి కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది.
6. డౌన్ సిండ్రోమ్ వల్ల కూడా చాలా మంది తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


తెల్లజుట్టు సమస్య రాకుండా ఉండాలంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెల్ల జుట్టుకు కేవలం హెన్న వంటి కలర్స్‌ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.


హెన్న మాస్క్‌ తయారు చేసే పద్ధతి:
ముందుగా హెన్న మాస్క్‌ను తయారు చేయడానికి హెన్నను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ బౌల్‌ తీసుకుని అందులో హెన్నను పొడిని కలిపాలి. అందులోనే ఒక టీ స్పూన్‌ అలోవేరా జెల్‌ వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. అందులోనే తగినంత నీటిని వేసి మిశ్రంలా తయారు చేసుకోవాలి. ఇలా మిక్స్‌ చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు కూడా సులభంగా నల్లగా మారుతుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే


Also Read: Jio plans for ipl 2023: అన్‌లిమిటెడ్ డేటాతో ఐపీఎల్ చూసే అవకాశం, నెలకు 198 రూపాయలే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook