Coronavirus: ఇండియాలో కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదా
Coronavirus: కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లుంటుందో తెలియదు. వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంది. ఇండియాలో పరిస్థితి ఎలా ఉండబోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న విషయం మరింత ఆందోళన కల్గిస్తోంది.
Coronavirus: కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లుంటుందో తెలియదు. వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంది. ఇండియాలో పరిస్థితి ఎలా ఉండబోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న విషయం మరింత ఆందోళన కల్గిస్తోంది.
కరోనా మహమ్మారి(Corona Pandemic)నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి కలుగుతుందనేది చెప్పలేని పరిస్థితిగా మారింది. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ విస్తరిస్తూనే ఉంది. అధిక జనాభా ఉన్న ఇండియాలో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది కలవరం కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి.
ఇండియాలో కరోనా వైరస్ ఎప్పటికీ నిలిచిపోయే వ్యాధి దశలో మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. దేశంలో మరికొద్ది రోజులు కోవిడ్ ఇలానే ఉండబోతుందని స్పష్టం చేసింది. పిల్లలకు కరోనా వ్యాధి సోకినా..స్వల్పంగానే ప్రభావం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ఇటీవల కోవిడ్ వైరస్ ఎప్పటికీ అంతం కాదని..మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి. సార్స్‌కోవ్ 2 ను అంతం చేయవచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్..ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందకు పైగా మ్యూనాలజిస్టులు, వైరాలజిస్టులు, ఆరోగ్య నిపుణుల్ని అడిగింది. ఇందులో 90 శాతానికి పైగా నిర్మూలించడం కుదరదనే సమాధానం చెప్పారు.
Also read: PCV Vaccine: ఏపీలో న్యుమోనియో వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook