COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Winter Care: చలికాలం వచ్చిందంటే చాలు అందరూ లేజీగా తయారవుతారు. అంతేకాకుండా వెచ్చని దుస్తువులు ధరించి బద్దకంతో పడుకుంటారు. కొంతమందైతే వేడి వేడి టీలను తాగుతూ ఉంటారు. వాతావరణంలో తేమ శాతం ఒక్కసారిగా పెరిగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే  చలి కారణంగా వాతావరణంలో బ్యాక్టీరియా పెరిగి ఊబకాయం, కీళ్లనొప్పులు, బ్రాంకైటిస్, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చలికాలంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఇతర సమస్యల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


వ్యాధులు ఎందుకు వస్తాయి?
మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఉష్ణోగ్రతలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడం వల్ల శరీరం లోపల టెంపరేచర్ లో మార్పులు వచ్చి తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా లోపల శరీరం వెచ్చదనం కోల్పోయి అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి చలికాలంలో తప్పకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


ఊబకాయం:
చాలామందిలో చలికాలం ఎక్కువగా ఆకలిగా అనిపిస్తుంది. దీనికి కారణంగా ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వాతావరణంలో చలి తీవ్రత పెరగడం కారణంగా బద్ధకంగా ఒకే దగ్గర కూర్చొని ఉంటారు. దీంతో శరీర శ్రమ కూడా తగ్గిపోతుంది. దీని కారణంగా ఊబకాయం సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా వ్యాయామాలు చేయడం చాలా మంచిది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


కీళ్లనొప్పులు:
చలికాలంలో ఒకే చోట కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు, మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శరీరంలో పోషకాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ సమయంలో విటమిన్‌ కలిగి ఆహారాలతోపాటు వ్యాయామాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అలాగే సూర్యరశ్మిలో నిలబడడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల కీళ్ల నొప్పుల సమస్యలు రాకుండా ఉంటాయి.


జలుబు, జ్వరం:
చలి కాలంలో సాధరణంగా వచ్చే సమస్యల్లో జలుబు ఒకటి..దీని కారణంగా  జ్వరం, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, కండరాల నొప్పులు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి శరీరానికి తగినంత వెచ్చదనం అందించాల్సి ఉంటుంది. 


ఈ చిట్కాలు తప్పనిసరి:
శరీరం వెచ్చగా ఉంచుకోవడానికి ఇంట్లో హాట్ బ్లోవర్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
సూర్యకాంతిలో 15 నుంచి 20 నిమిషాల పాటు నిలబడాల్సి ఉంటుంది. 
అల్లం, తులసితో తయారు చేసిన టీలను ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. 
శరీరానికి పోషకాలను అందించే సీజనల్ పండ్లు, ఆకు కూరలను తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి