Winter Fruits: చలికాలంలో ఆ నాలుగు పండ్లు తింటే చాలు..ఏ రోగం దరిచేరదిక
Winter Fruits: చలికాలంలో సహజంగానే రోగాలు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో అదేపనిగా రోగాలు సోకుతుంటే..నాలుగు రకాల పండ్లతో ఉపశమనం పొందవచ్చు. ఆ పండ్లు ఏంటి, ఎలాంటి లాభం కలుగుతుందో చూద్దాం..
చలికాలం వచ్చేసింది. దేశంలో నెమ్మదిగా చలిగాలుల ప్రభావం పెరుగుతోంది. దాంతోపాటు చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం పొందాల్సి ఉంటుంది.
వాతావరణం మరిపోయింది. చలికాలం ప్రారంభంతోనే అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. చలికారణంగా జలుబు, దగ్గు, జ్వరాలు ప్రబలుతున్నాయి. మరోవైపు కాలుష్యం కూడా ఓ కారణంగా కన్పిస్తోంది. చలికాలంలో సహజంగా ఇమ్యూనిటీ తగ్గడంతో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తుంటాయి. అందుకే ఇమ్యూనిటీని పెంచే పదార్ధాలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యమైంది విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు. ఇవి సేవించడం ద్వారా శరీరానికి చలి నుంచి, వ్యాధుల్నించి పోరాడే సామర్ధ్యం అందుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజెస్
చలికాలంలో శరీరానికి విటమిన్ సి అవసరం చాలా ఉంది. శరీరంలో విటమిన్ సి కారణంగా చలి నుంచి తట్టుకునే శక్తి లభిస్తుంది. దీనికోసం ఆరెంజ్ తప్పకుండా తీసుకోవాలి. ఇందులో విటమిన్ సితో పాటు ఫోలెట్, పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఫలితంగా శరీరానికి రోగ నిరోధక శక్తి లభిస్తుంది.
ఉసిరితో రోగ నిరోధక శక్తి
చలికాలంలో ఉసిరి కాయలు తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కళ్లు, కేశాలు, చర్మం డ్రై కాకుండా ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యల్లో కూడా ఉసిరి ప్రయోజనం చేకూరుస్తుంది.
నల్ల ద్రాక్షతో ప్రయోజనాలు
చలికాలంలో నల్ల ద్రాక్ష మార్కెట్‌లో పుష్కలంగా దొరుకుతాయి. నల్ల ద్రాక్షలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. రోజూ కాకపోయినా వారంలో ఒక్కసారైనా నల్లద్రాక్ష తింటే శరీరానికి ఇమ్యూనిటీ కలుగుతుంది.
క్యారట్ లాభాలు
చలికాలంలో లభించే క్యారట్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారట్‌ను కూర, సలాడ్ ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. కంటి వెలుతురు పెంచేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువ కావడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Also read: Peepal Leaves Benefits: రావిచెట్టు ఆకుల జ్యూస్‌తో ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook