ఆరోగ్యానికి మేలు కల్గించే ఔషధ గుణాలు మనచుట్టూ లభించే చెట్లు చేమల్లో చాలావరకు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది రావి చెట్టు. రావి చెట్టు ఆకులు చాలా రకాల రోగాల్ని దూరం చేయగలవు.
రావి చెట్టు ఆకుల్లో ఔషధీయ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చెట్టు ఆకుల జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. రావి చెట్టు ఆకుల్లో చాలారకాల పోషక గుణాలున్నాయి. ఇవి పలు తీవ్రమైన వ్యాధుల్నించి కాపాడేందుకు దోహదపడతాయి. రావిచెట్టు ఆకుల్లో కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ వంటి మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి న్యూట్రియంట్లు ఉన్నాయి. రావిచెట్టు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చాలా రకాల రోగాల్ని దూరం చేస్తాయి. రావి చెట్టు ఆకుల జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
రావిచెట్టు ఆకులు ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. రావిచెట్టు ఆకుల జ్యూస్ ఊపిరితిత్తుల్ని డీటాక్స్ చేస్తాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఊపిరితిత్తుల స్వెల్లింగ్ సమస్య దూరమౌతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే..రావిచెట్టు ఆకుల జ్యూస్‌తో దూరం చేయవచ్చు.
రావి చెట్టు ఆకుల్లో ఉన్న గుణాలు దగ్గును తగ్గించడంలో అద్బుతంగా ఉపయోగపడతాయి. రావి ఆకుల జ్యూస్ తాగడం వల్ల దగ్గు సమస్య దూరమౌతుంది. మరీ ముఖ్యంగా కఫం సమస్య దూరమౌతుంది.
జీర్ణక్రియలో ఉపయోగం
రావిచెట్టు ఆకుల జ్యూస్ తాగడం వల్ల అజీర్తి సమస్య పోతుంది. ఒకవేళ అజీర్తితో పాటు ఇతర సమస్యలుంటే రావిచెట్టు ఆకుల జ్యూస్‌తో అన్ని సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా..గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ సమస్యలు దూరమౌతాయి.
రక్తాన్ని శుభ్రం చేయడం
రావిచెట్టు ఆకుల జ్యూస్ బెస్ట్ డీటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తం శుభ్రమౌతుంది. రక్తం అశుభ్రంగా ఉంటే చాలా రకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల ముఖంపై పింపుల్స్, నల్లటి మచ్చలు అన్ని దూరమౌతాయి.
బ్లడ్ షుగర్ నియంత్రణ
రావిచెట్టు ఆకుల జ్యూస్‌తో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. రావిచెట్టు ఆకుల్లో ఉన్న పోషక గుణాలు స్పైక్‌ను నియంత్రిస్తాయి. బ్లడ్ షుగర్ సాధారణస్థాయికి చేరుతుంది. రావిచెట్టు ఆకుల జ్యూస్ డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం.
దంతాలు, చిగుళ్లకు చికిత్స
రావిచెట్టు ఆకుల జ్యూస్ దంతాలు, చిగుళ్లకు అద్భుతంగా మేలు చేకూరుస్తుంది. నోట్లోని బ్యాక్టీరియాను చంపుతుంది ఈ జ్యూస్. దంతాల్ని ఆరోగ్యంగా మారుస్తుంది. చిగుళ్ల సమస్యల్ని రావిచెట్టు ఆకుల జ్యూస్ తగ్గిస్తుంది.
Also read: Weight Loss Tips: ఉదయం పూట ప్రతి రోజు వాకింగ్ చేస్తే..బరువు తగ్గడమేకాకుండా..గుండె జబ్బులకు చెక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook