Heavy Bleeding Problem: ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఓ సాధారణ ప్రక్రియ. ప్రతి నెలా ఎదురయ్యేదే అయినా చాలామందికి సమస్యగా మారుతుంటుంది. తీవ్రమైన కడుపు లేదా నడుము నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఒక్కేసారి వారం రోజులపాటు బ్లీడింగ్ ఉంటుంది. ఇలా ఉంటే తేలిగ్గా తీసుకోకూడదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెవీ బ్లీడింగ్ అంటే వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ కొనసాగితే ఆ పరిస్థితిని మెనోరాజియా అంటారు. ఈ సమస్య తీవ్రమైందే అయినా కొన్ని సులభమైన చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్ జరగడానికి కారణాలు చాలానే ఉంటాయి. ఇందులో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరోన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, గర్భాశయంలో ఎండోమెట్రియాసిస్ ఉండటం కారణం కావచ్చు. ఒక్కోసారి రక్తం పల్చగా మారడంతో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. కొన్ని రకాల మందుల వాడకం కూడా బ్లీడింగ్ అధికంగా ఉండేందుకు కారణం కావచ్చు.


హెవీ బ్లీడింగ్ లక్షణాలు


హెవీ బ్లీడింగ్ కారణంగా గంటకోసారి ప్యాడ్ మార్చాల్సి వస్తుంది. రాత్రి బెడ్ పాడవుతుంటుంది. రక్తం క్లాట్స్ కింద వస్తుంటుంది. తీవ్రమైన బలహీనత, తల తిరగడం, అలసట వంటివి ఉంటాయి. ఎనీమియా ఉంటుంది. అయితే హెవీ బ్లీడింగ్ అరికట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైంది దాల్చినచెక్క. దాల్చినచెక్క వినియోగం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి కిచెన్ లో లభ్యమయ్యేదే ఇది. గ్లాసు నీళ్లలో కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఉడకబెట్టాలి. రోజులో 1-2 సార్లు తాగాలి. 


హెవీ బ్లీడింగ్ కారణం మెగ్నీషియం లోపించడమే. హెవీ బ్లీడింగ్ జరిగితే మీరు తీసుకునే ఆహారంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. తద్వారా బ్లీడింగ్ అరికట్టవచ్చు.అశోక చెట్టు బెరడు కూడా అద్బుతంగా పనిచేస్తుంది. అశోక చెట్టు బెరడుని ఓ 50 గ్రాములు తీసుకుని 2 కప్పుల నీటిలో బాగా ఉడకబెట్టాలి. రోజూ క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలుంటాయి.


Also read: 6 Vitamins: 40 ఏళ్లు దాటాక పటిష్టంగా యౌవనంగా ఉండాలంటే ఏయే విటమిన్లు అవసరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook