World Cancer Day Symptoms: శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే..అప్రమత్తం కావల్సిందే, కేన్సర్ కారకం కావచ్చు
World Cancer Day Symptoms: ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం. కేన్సర్‌ను సరైన సమయంలో గుర్తించడం అవసరం. ప్రారంభంలో చికిత్స సాధ్యమే. కేన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
కేన్సర్ రోగాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా కేన్సర్ గురించి అవగాహన చేసుకోవల్సిన అవసరముంది. కేన్సర్‌ను సకాలంలో గుర్తించడం ద్వారా తగిన చికిత్స సాధ్యమౌతుంది. ఆ విషయాలు మీ కోసం..
సైన్స్ ఎంతగా అభివృద్ధి సాధించినా..వైద్యం ఎంతగా అందుబాటులో వచ్చినా కేన్సర్‌తో పోరాడటం ఇవాళ్టికీ కష్టమే అవుతోంది. కేన్సర్ సోకిందని తెలిసేటప్పటికే చివరి దశలో ఉంటున్నారు. ఎందుకంటే కేన్సర్ సోకినప్పుడు కన్పించే కొన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కేన్సర్ చివరి దశకు చేరుకుంటే..చికిత్స చేయించడం కష్టమైపోతుంటుంది. కేన్సర్ సోకితే ఏ విధమైన లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..
కేన్సర్ లక్షణాలు
కేన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించగలిగితే చికిత్స చాలా సులభంగా ఉంటుంది. దీనివల్ల ప్రాణాలు నిలబట్టే అవకాశముంటుంది. ఈ లక్షణాల గురించి తెలుసుకోవల్సిన అవసరం చాలా ఉంది. కేన్సర్ సోకితే అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, అన్నం మింగేటప్పుడు ఇబ్బంది, అల్సర్, మూత్రం ఆగి ఆగి రావడం, దగ్గుతో పాటు రక్తం రావడం, అజీర్తి, కడుపు నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు కన్పిస్తాయి.
కేన్సర్ దశలు
కేన్సర్ నాలుగు దశల్లో ఉంటుంది. ఒకవేళ కేన్సర్‌ను తొలి దశలో ఉంటే చికిత్స కాస్త సులభమే అవుతుంది. ఆ తరువాత దశ నుంచి క్రమంగా సీరియస్ అవుతుంది. కేన్సర్ చివరి దశ అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 లో చాలా విషమంగా ఉంటుంది.
జీవనశైలికి సంబంధించిన కొన్ని అలవాట్లు కూడా కేన్సర్‌కు కారణం కావచ్చు. వీటి నుంచి కాపాడుకోవాలంటే..కొన్ని సూచనలు పాటించాల్సి ఉంది. ధూమపానంతో నోటి కేన్సర్ రావచ్చు. అందుకే ధూమపానానికి దూరంగా ఉండాలి. మద్యం తాగడం ఆపేయాలి. జీవనశైలిని క్రమబద్ధీకరించుకోవాలి. ఆరోగ్యకరమైన పదార్ధాలు తినాలి. వ్యాయామం ప్రతిరోజూ చేయాలి. 40 ఏళ్ల వయస్సు తరువాత కేన్సర్ ముప్పు పెరిగిపోతుంది. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా అప్రమత్తం కావాలి.
Also read: Bones Health: ఎముకలు బలంగా ఉండాలంటే ఏవి తినాలి, ఏ అలవాట్లు మానేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook