World Liver Day 2024 Fatty Liver Symptoms: ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధుల  గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈరోజు ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకొంటారు. ప్రపంచ కాలేయ దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 19న జరుపుకుంటారు. సాధారణంగా కాలేయం అనేది మన శరీరం అవయవాల్లో ఒకటి. ఇది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరం నుంచి అవసరం లేని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. అయితే, ఈ కాలంలో కాలేయ సంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్. ఇది లివర్ ను పూర్తిగా డామేజ్ చేసే పరిస్థితికి దారితీస్తుంది. చివరికి ప్రాణం పోయే పరిస్థితులకు కూడా దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఫ్యాటీ లివర్ లక్షణాలను అంత త్వరగా గుర్తించలేం. ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు  లివర్ పరిమాణం కూడా పెరుగతుంది. ఇది వైద్యులు మాత్రమే చూసి గుర్తిస్తారు. ఈ లక్షణం అందరిలో ఒకే విధంగా ఉండదు.సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..


ఇదీ చదవండి: చెర్రీ టమాటలతో 5 ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా తింటే రెట్టింపు లాభాలు..


మూత్రం రంగులో మార్పు..
ఫ్యాటీ లివర్ సమస్యలో మొదటి లక్షణం మూత్రం రంగు కాస్త మబ్బుగా నల్లగా కనిపిస్తుంది. దీన్ని గుర్తించిన వెంటనే సరైన చికిత్స తీసుకోవాలి.


 బరువు తగ్గడం..
ప్యాటీ లివర్ కి ఉండే మరో లక్షణం ఏ కారణం లేకుండా హఠాత్తుగా బరువు తగ్గిపోతుంటారు. అంటే ఎటువంటి డైట్ ,ఎక్సర్సైజ్ చేయకుండానే వెయిట్ లాస్ అయిపోతుంటారు. ఇది కూడా  లివర్ సమస్య అని తెలుసుకోవాలి.


పొత్తికడుపు..
పొత్తికడుపు బరువుగా అనిపిస్తుంది, సాదరణంగా ఉండదు. పొత్తికడుపులో తరచూ నొప్పిని అనుభవిస్తారు. ఇది కూడా లివర్ సంబంధించిన సమస్యను గుర్తించాలి
వెంటనే వైద్యుని సంప్రదించాలి.


ఇదీ చదవండి: మంచి బలం..నిత్యయవ్వనం పొద్దుతిరుగుడు విత్తనాలతోనే సాధ్యం..!


వాంతులు..
ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.అయితే, ఈ లక్షణాలు కనిపించగానే ఫ్యాటీ లివర్ సమస్యే అని కాదు, లక్షణాలు కనిపించనంత మాత్రాన లివర్ ఆరోగ్యంగా ఉందని గ్యారెంటీ లేదు. వైద్యులను సంప్రదించి లివర్ ఆరోగ్యం గురించి అప్పుడప్పుడు చెక్ చేయించుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా  40 ఏళ్ల పై బడితే లివర్ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook