Worst Breakfast Food: శరీరం అరోగ్యంగా ఉండానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని తరచుగా నిపుణులు చెబుతూ ఉంటారు. తినే క్రమంలో పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, శక్తి వంతంగా తయారవుతుంది. ఒక వేళా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అనారోగ్య రకమైన సమస్యలు వాటిల్లే అవకాశాలున్నాయి. కావున ప్రతి రోజూ సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి. సరనైన సమయంలో సరైన ఆహారం తిసుకొకపోతే ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఉదయం తీసుకునే అల్పాహారంలో మంచి పోషకాలుండే ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా నిపుణులు సూచించిన ఈ ఐదు రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. తినకూడని  ఆహారలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ వీటిని అస్సలు తీసుకోకండి:


పండ్ల రసం:


హడావిడిగా ఉన్నప్పుడు ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతుంటారు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తిసుకునే వారు అస్సలు వీటిని తీసుకోవద్దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ను కడుపు నిండా తినడాని ప్రయత్నించండి.


వెన్నతో చేసిన టోస్ట్:


ప్రస్తుతం చాలా మంది భారతీయులు బ్రేక్‌ఫాస్ట్‌లో బటర్ టోస్ట్‌ను తింటూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అంతా మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే వెన్నలో కొవ్వు శాతం అధికంగా ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఆ తర్వాత శరీర సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


చక్కెర ఆహారం:


బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా చక్కెర పరిమాణం ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్‌ తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున ఉదయం పూట తినే ఆహారంలో చక్కెర తక్కువగా ఉండే ఆహారం తింటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Read also: Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!


Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా? 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook