Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!

Kodali Nani: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టీడీపీపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 9, 2022, 08:07 PM IST
  • ఏపీలో పొలిటికల్ హీట్
  • చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
  • ముగిసిన వైసీపీ ప్లీనరీ
Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!

Kodali Nani: గుంటూరులో వైసీపీ ప్లీనరీ వేదికగా టీడీపీ, చంద్రబాబుపై ఆ పార్టీ నేత కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్నికలతో చంద్రబాబుకు రాజకీయ సమాధేనన్నారు. భగభగమండే సూర్యుడు జగన్ అని అన్నారు. ఆయనపై దుష్టచతుష్టయం కుట్రలు భగ్నం చేస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో హామీలను 95 శాతం అమలు చేశామని చెప్పారు.
 
డబ్బులు ఉన్న వాళ్లకేనా ఇంగ్లీష్‌ మీడియం అని ప్రశ్నించారు. పేదల పిల్లలకు ఉన్నత చదువులను సీఎం అందిస్తున్నారని తెలిపారు. పెన్షన్లకు లక్షల కోట్లు ఇచ్చిన సీఎం జగన్ ఎక్కడ..చంద్రబాబు ఎక్కడ అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. పుట్టి పెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచారా అని అన్నారు. దుష్టచతుష్టయం పర్మినెంట్‌గా పిచ్చాస్పత్రులకు వెళ్లేందుకు సమయం దగ్గర పడిందన్నారు.

ఇందుకు అమరావతి కేంద్రంగా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. 2024లో టీడీపీ, చంద్రబాబు రాజకీయ జీవితాలను పాతాళంలో పాతిపెడతామని స్పష్టం చేశారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేస్తే..తల్లి ఉద్యోగం పోతుందా అని పచ్చ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తమదే అధికారమని తేల్చి చెప్పారు.

Also read:AP Rains: ఏపీలో రెయిన్ అలర్ట్..కీలక ఆదేశాలు జారీ చేసిన విపత్తుల సంస్థ..!

Also read:Telugu States Rains Live Updates: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News